ఈ హిందూ సంస్థలు… ఎంతైనా గ్రేట్..! మేము సెక్యులరిస్టులం.! మాకు అందరూ సమానం అంటూనే.., సంతుష్టికరణ విధానాలతో, ఎప్పుడూ ఒక వర్గాన్ని బుజ్జగిస్తు రాజకీయాలు చేసే రాజకీయ పార్టీల నేతలను ఈ హిందూ సంస్థలు కనీసం ఎన్నికల సమయంలోనైనా దారికి తీసుకువస్తున్నాయా?
లేక పోతే ఏంటీ ? భారత రాజకీయాల్లో హిందూ అనగానే అదో పలకకూడని పదమని.. ఇంకా మతోన్మాదమని కారుకూతలు కూసిన నేతలే., ఇప్పుడూ…తామే..! ది గ్రేట్ హిందువులమని అనడం ఏంటీ? అంతేనా… నుదుటిపై తిలకం.. ఇంకా జంధ్యం, వేసుకుని పరమ భక్తుల వలే గేటాఫ్ లు మార్చేస్తున్నారు. ఆలయాల వెంట పరుగులు తీస్తున్నారు. అయితే ఇదంతా ఎన్నికల వేళా… అమాయక హిందువులను బుట్టలో వేసుకునేందుకు.. .ఎలక్షన్స్ స్ట్రాటజిస్టుగా పేరుపొందిన ప్రశాంత్ కిశోర్ ఆయా పార్టీల నేతలతో చేయిస్తున్న స్టంట్ అని అంటున్నారు విశ్లేషకులు.
పశ్చిమ బెంగాల్ లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో ఎన్నడు లేనివిధంగా మమతా బెనర్జీ ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కొన్ని సర్వేల సంస్థలు.. మమతాకు అనుకూలంగా.., మరికొన్ని సర్వేలు బీజేపీకి అనుకూలంగా, తమ ఫ్రీ పోల్ సర్వే ఫలితాలను వెల్లడిస్తూ…, ఎన్నికల వేడిని ఇంకా రగిస్తున్నాయి.
అయితే పదేళ్ల తృణమూల్ కాంగ్రెస్ పాలనలో హిందువులు పూర్తిగా వివక్షకు గురయ్యారనే అపవాదును మమతా బెనర్జీ మూటగట్టుకున్నారు. దుర్గా నవరాత్రులు, అలాగే సరస్వతి పూజలకు ఆమె గతంలో అనుమతిని నిరాకరించిందనే ఆరోపణలు ఉన్నాయి. చాలా సందర్భాల్లో హిందూ సంఘాలు తమ పండుగుల నిర్వహణ కోసం.., మండపాల ఏర్పాటు కోసం కోర్టులకు వెళ్లి పర్మిషన్లు తీసుకోవాల్సిన విషయాన్ని కొంతమంది గుర్తు చేస్తున్నారు.
బెంగాల్ లో బీజేపీ బలపడగానికి ప్రధాన కారణం మమతా బెనర్జీ బుజ్జగింపు రాజకీయాలేనని చెబుతున్నారు. మమతా పానలో వివక్షకు గురైనా హిందువులు అందరూ కూడా బీజేపీ వైపు మొగ్గుచూపిన విషయాన్ని గుర్తించిన ప్రశాంత్ కిశోర్… మమతా బెనర్జీ చేత హిందూ కార్డును ప్రయోగింప చేస్తున్నారని చెబుతున్నారు.
గతంలో ఎన్నడూ కూడా తాను హిందువును అని మరింత ఇంతా బహిరంగంగా మమతా బెనర్జీ చెప్పుకున్నది లేదు. అంతేకాదు తాను బ్రాహ్మణ మహిళను అంటూ కులాన్ని సైతం మమత బయటపెట్టుకున్నారు. అంతేకాదు శివాలయంలో పూజలు చేస్తున్నారు. శివనామాలను, మంత్రాలను బహిరంగంగా ప్రజల ముందు పఠిస్తున్నారు. అంతేకాదు శివరాత్రి రోజునే తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సైతం విడుదల చేశారు.
అయితే సడన్ గా మమతా బెనర్జీ అటూ హిందూ కార్డు, ఇటు కులం కార్డును వాడుకోవడానికి తాపత్రయం పడుతుండటం చూసి.. బెంగాలీ ప్రజలు నవ్వుకుంటున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మమతా బెనర్జీ ఇస్లామిక్ స్టడీస్ లో పీజీ చేశారు. ఆమె హిజాబ్ ధరించి మత ప్రార్థనలు చేశారు. ముస్లింలకు తానే రక్షకురాలగా అనేక సార్లు ప్రకటించుకున్నారు. బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలు కొనసాగుతున్న, రోహింగ్యా ముస్లింలు రాష్ట్రంలో అక్రమంగా చొరబడినారనే ఆరోపణలు వచ్చినా కూడా… మమతా బెనర్జీ ఏనాడు ఖండించలేదనే విమర్శలు ఉన్నాయి.
బీజేపీ వైపు మళ్లీన హిందు ఓట్లును తిరిగి తృణమూల్ కాంగ్రెస్ వైపునకు మళ్లించేందుకే… ప్రశాంత్ కిశోర్.. మమతాకు ఈ సలహా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. హిందూ ఓట్లు ఏకపక్షంగా బీజేపీ వైపు పోలరైజ్ కాకుండా చేయడంలో తృణమూల్ కాంగ్రెస్ విఫలమైతే.., ప్లాన్ బీ లో భాగంగానైనా, కనీసం కులం కార్డు ద్వారానైనా.., తన కులస్థులైన బ్రాహ్మణ ఓట్లు…, బీజేపీ వైపునకు వెళ్లకుండా చేయాలనే తలంపుతోనే ప్రశాంత్ కిశోర్ మమతా చేత తొలిసారిగా కులం కూడా ప్రయోగింప చేశారని అంటున్నారు.
ప్రశాంత్ కిశోర్ గతంలో అనేక పార్టీలకు ఎన్నికల స్ట్రాటజిస్టుగా పనిచేశారు. 2020లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో… ఆమ్ ఆద్మీ పార్టీకి సలహాదారుడిగా కూడా వ్యవహారించారు. ఆ సమయంలో సీఏఏ వ్యతిరేక ఆందోళనలు, ఉద్రిక్తతల కారణంగా…, హిందువులంతా బీజేపీకి ఫర్ గా ఉన్నారని సర్వేల్లో తేలడంతో… అరవింద్ కేజ్రీవాల్ కూడా ప్రశాంత్ కిశోర్ సలహా మేరకు.. హనుమాన్ మందిరం బాట పట్టాడు. అంతేకాదు తాను భక్తుడిని అంటూ నదుట పెద్ద బొట్టు పెట్టుకోవడమేకాదు… బహిరంగంగానే హనుమాన్ చాలీసా పాడి వినిపించాడు.
అలాగే ..2017లో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా అచ్చం రాహుల్ గాంధీ కూడా ఇలాగే చేశాడు. టెంపుల్ రన్ చేశాడు. విదేశీ ఇస్లామిక్ దురాక్రమణదారుల చేతుల్లో ధ్వంసమైనా.. సోమనాథ్ మందిర పునర్ నిర్మాణాన్ని రాహుల్ గాంధీ ముత్తతా జవహర్ లాల్ నెహ్రూ వ్యతిరేకించిన సంగతిని మనం మర్చిపోరాదు. రాహుల్ గాంధీ అదే సోమనాథ్ మందిరాన్నికి వెళ్లి ప్రత్యేక పూజలు చేశారు. అయితే మందిరం రిజిస్టర్ లో మాత్రం నాన్ హిందూ కాలమ్ సంతకం చేయడంతో ఆ స్టంట్ అప్పట్లో బెడిసికొట్టింది.
ఇలా ఎన్నికలు రాగానే… గతంలో తామే వీర సెక్యులర్ నేతలమని ప్రకటించుకున్నవారందరూ…, హిందువుల ఓట్ల కోసం టెంపుల్ రన్ చేయడాన్ని కొంతమంది విశ్లేషకులు స్వాగతిస్తున్నారు. ప్రతి ఎన్నికల్లో హిందుత్వను.., హిందువులను విస్మరించని విధంగా.., రాజకీయ వాతావరణాన్ని సృష్టించడంలో హిందూ సంస్థలు సక్సెస్ అయ్యాయని అంటున్నారు. అయితే హిందూకార్డు ప్రయోగించిన మమతా బెనర్జీ ఎంత వరకు సక్సెస్ అవుతారో లేదో తెలియాలంటే… మే 2వ తేదీ వరకు ఆగాల్సిందే.