More

    బెంగాల్ లో ముగిసిన నాలుగో దశ పోలింగ్

    అయితే ఉదయం నాలుగో విడత ప్రారంభమైన కొద్దిసేపటికే కూచ్ బిహార్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు…కొంతమంది గ్రామస్థులను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సీతల్ కుచిలోని పోలింగ్ బూత్ నంబర్ 126 వద్ద గొడవలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో  సీఐఎస్ఎఫ్ కు చెందిన క్విక్ రియాక్షన్ టీమ్ స్థానిక పోలీసులను తీసుకుని జోర్ పట్కి ప్రాంతంలో పెట్రోలింగ్  నిర్వహించింది. ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకుంటున్న 50 నుంచి 60 మంది తో కూడిన తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వారందరిని చెదరగొట్టి ఓటర్లను ఓటు వేసేందుకు పంపించారు. అయితే ఘటన జరిగిన గంట తర్వాత దాదాపు 150 మంది స్థానికులు కర్రలు ఇతర మరణాయుధాలతో పోలింగ్ బూత్ లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బూత్ లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కళ్లపై దాడి చేసికొట్టారు. ఓ హోంగార్డును సైతం తీవ్రంగా గాయపర్చారు. దీంతో అక్కడే విధుల్లో ఓ సీఐఎస్ఎఫ్ జవాను వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గుంపులో కొంతమంది సీఐఎస్ఎఫ్ పై దాడికి యత్నంచడమే కాకుండా అతని రైఫిల్ ను సైతం లాక్కునేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ పెనుగులాటలో కాల్పులు జరిగాయని.., నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. దీంతో సీతల్ కూచిలోలోని 126 పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ను వాయిదా వేశారు. అలాగే సీతల్ కూచిలోని మరో  పోలింగ్ బూత్ లో బీజేపీ ఏజెంట్ గా  ఉన్న 18 ఏళ్ల ఆనంద్ బుర్మాన్  గుర్తు తెలియని దుంగులు కాల్పిచంపారు. తృణమూల్ కాంగ్రెస్ గుండాలే కాల్చిచంపారని బీజేపీ ఆరోపించింది. అటు హుగ్లీలోని పోలింగ్ బూత్ కేంద్రాల సందర్శనకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ కారుపై సైతం స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులపై వాహనాలపై కూడా దాడి చేశారు.

    అటు సీతల్ కుచి కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే కేంద్రబలగాలపై దాడులు చేయండి అంటూ మమతా బెనర్జీ తృణమూల్ గుండాలకు ఆదేశాలు ఇస్తున్నారని పీఎం మోదీ ఆరోపించారు. కూచ్ బిహార్ కాల్పుల ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఎం మోదీ ఈసీని కోరారు. అటు మమతా బెనర్జీ కాల్పుల ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు వచ్చినవారిని భద్రత బలగాలు కాల్చిచంపాయని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ఆమె అన్నారు. బెంగాల్ లో నాలుగో దశలో జరిగిన హింసాకాండపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ లు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

    ఈ రోజు ముగిసిన నాలుగో దశ పోలింగ్ తో  135 స్థానాలకు పోలింగ్ పూర్తయింది.మరో నాలుగు దశలు 159 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.  

    పశ్చిమ బెంగాల్ లో నాలుగో దశ పోలింగ్ తీవ్ర హింసాకాండ..ఉద్రిక్త పరిస్థితుల మధ్య ముగిసింది. 76 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది.నాలుగో దశలో భాగంగా ఉత్తర బెంగాల్ లోని కూచ్ బిహార్, అలీపురద్వార్ జిల్లాలతోపాటు దక్షిణ 24 పరగణ, హౌరా, హుగ్లీలోని 44 అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలింగ్ నిర్వహించడం జరిగింది.

    అయితే ఉదయం నాలుగో విడత ప్రారంభమైన కొద్దిసేపటికే కూచ్ బిహార్ లో హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్నాయి. చాలా తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు…కొంతమంది గ్రామస్థులను ఓటు వేయకుండా అడ్డుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో సీతల్ కుచిలోని పోలింగ్ బూత్ నంబర్ 126 వద్ద గొడవలు జరుగుతున్నట్లు సమాచారం అందడంతో  సీఐఎస్ఎఫ్ కు చెందిన క్విక్ రియాక్షన్ టీమ్ స్థానిక పోలీసులను తీసుకుని జోర్ పట్కి ప్రాంతంలో పెట్రోలింగ్  నిర్వహించింది. ఓటర్లను ఓటు వేయకుండా అడ్డుకుంటున్న 50 నుంచి 60 మంది తో కూడిన తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన కార్యకర్తను సీఐఎస్ఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. వారందరిని చెదరగొట్టి ఓటర్లను ఓటు వేసేందుకు పంపించారు. అయితే ఘటన జరిగిన గంట తర్వాత దాదాపు 150 మంది స్థానికులు కర్రలు ఇతర మరణాయుధాలతో పోలింగ్ బూత్ లోకి చొరబడే ప్రయత్నం చేశారు. బూత్ లో విధులు నిర్వహిస్తున్న ఆశా వర్కళ్లపై దాడి చేసికొట్టారు. ఓ హోంగార్డును సైతం తీవ్రంగా గాయపర్చారు. దీంతో అక్కడే విధుల్లో ఓ సీఐఎస్ఎఫ్ జవాను వీరిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. గుంపులో కొంతమంది సీఐఎస్ఎఫ్ పై దాడికి యత్నంచడమే కాకుండా అతని రైఫిల్ ను సైతం లాక్కునేందుకు ప్రయత్నించారని తెలుస్తోంది. ఈ పెనుగులాటలో కాల్పులు జరిగాయని.., నలుగురు వ్యక్తులు మరణించారని పోలీసులు తెలిపారు. దీంతో సీతల్ కూచిలోలోని 126 పోలింగ్ కేంద్రంలో ఓటింగ్ ను వాయిదా వేశారు. అలాగే సీతల్ కూచిలోని మరో  పోలింగ్ బూత్ లో బీజేపీ ఏజెంట్ గా  ఉన్న 18 ఏళ్ల ఆనంద్ బుర్మాన్  గుర్తు తెలియని దుంగులు కాల్పిచంపారు. తృణమూల్ కాంగ్రెస్ గుండాలే కాల్చిచంపారని బీజేపీ ఆరోపించింది. అటు హుగ్లీలోని పోలింగ్ బూత్ కేంద్రాల సందర్శనకు వెళ్లిన బీజేపీ అభ్యర్థి లాకెట్ ఛటర్జీ కారుపై సైతం స్థానికులు రాళ్ల దాడికి పాల్పడ్డారు. మీడియా ప్రతినిధులపై వాహనాలపై కూడా దాడి చేశారు.

    అటు సీతల్ కుచి కాల్పుల ఘటనపై ప్రధాని మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే కేంద్రబలగాలపై దాడులు చేయండి అంటూ మమతా బెనర్జీ తృణమూల్ గుండాలకు ఆదేశాలు ఇస్తున్నారని పీఎం మోదీ ఆరోపించారు. కూచ్ బిహార్ కాల్పుల ఘటనకు బాధ్యులైనవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పీఎం మోదీ ఈసీని కోరారు. అటు మమతా బెనర్జీ కాల్పుల ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటు వేసేందుకు వచ్చినవారిని భద్రత బలగాలు కాల్చిచంపాయని మమతా బెనర్జీ ఆరోపించారు. దీనికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా బాధ్యత వహించాలని ఆమె అన్నారు. బెంగాల్ లో నాలుగో దశలో జరిగిన హింసాకాండపై బీజేపీ, తృణమూల్ కాంగ్రెస్ లు పోటాపోటీగా ఎన్నికల సంఘానికి ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకున్నారు.

    ఈ రోజు ముగిసిన నాలుగో దశ పోలింగ్ తో  135 స్థానాలకు పోలింగ్ పూర్తయింది.మరో నాలుగు దశలు 159 నియోజకవర్గాల్లో పోలింగ్ జరగనుంది.  

    Trending Stories

    Related Stories