అక్షయ్ కుమార్ హీరోగా నటించిన బెల్ బాటమ్ సినిమా ఇటీవలే విడుదల అయింది. సాధారణంగా అక్షయ్ కుమార్ సినిమాలకు మంచి ఆదరణ లభిస్తూ ఉంటుంది. కానీ ఈ సినిమాకు రివ్యూలు బాగా వస్తున్నా కూడా పెద్దగా కలెక్షన్లను రాబట్టుకోలేకపోతోంది. ఇలా ఉండగా ఊహించని విధంగా బ్యాన్ ను కూడా ఎదుర్కొంటోంది ఈ సినిమా.! సౌదీ అరేబియా, ఖతార్ మరియు కువైట్‌లో ఈ చిత్ర ప్రదర్శన ఇప్పుడు నిషేధించబడింది. భారతదేశంలో మహమ్మారి యొక్క రెండవ వేవ్ మధ్య థియేటర్లలో విడుదలవుతున్న పెద్ద బాలీవుడ్ చిత్రంగా నిలిచిన అక్షయ్ సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. అయితే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధికారులు అక్కడ స్క్రీనింగ్ కోసం దానిని క్లియర్ చేయలేదు.
రంజిత్ తివారీ దర్శకత్వం వహించిన బెల్ బాటమ్, ఇందిరాగాంధీ భారత ప్రధానిగా ఉన్న సమయంలో జరిగిన యదార్థ సంఘటనల నుండి ప్రేరణ పొందింది. ఈ చిత్రం 1984 విమానం హైజాక్ కథలో భాగంగా జరిగింది. వేర్పాటువాదుల బృందం మొదట విమానాన్ని లాహోర్‌లో ల్యాండ్ చేసి, ఆపై దుబాయ్‌కు తీసుకెళ్లింది. బెల్ బాటమ్ అనే కోడ్ పేరుతో ఉన్న రా ఏజెంట్ దుబాయ్‌లో కోవర్ట్ ఆపరేషన్‌తో ప్రయాణీకులను రక్షించినట్లు సినిమాలో చూపించారు. అయితే, సినిమాలో వాస్తవాలు చూపలేదని యూఏఈ అధికారులు నమ్ముతున్నారు. నిజానికి ఈ ఆపరేషన్‌కు అక్కడి రక్షణ మంత్రి అనుమతించకపోయినా.. చేపట్టినట్లుగా చూపడంతో యూఏఈ దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసింది. అసలు ఈ ఆపరేషన్ మొత్తం చేపట్టంది యూఏఈ అధికారులే అని, వాళ్లే భారత ప్రయాణికులను సురక్షితంగా విడిపించారని ఆ దేశం చెబుతోంది. అప్పటి రక్షణ మంత్రి షేక్ మొహమ్మద్ బిన్ రాషి అల్ మక్తౌమ్ ఆధ్వర్యంలో ఈ ఆపరేషన్ జరిగినట్లు చెబుతోంది. అందుకే ఈ సినిమాను యుఏఈలో బ్యాన్ చేశారు.
శ్రీమతి ఇందిరా గాంధీ పాత్రలో నటించిన లారా దత్తా ప్రశంసలు అందుకుంటోంది. బెల్ బాటమ్‌లో అదిల్ హుస్సేన్, వాణి కపూర్ మరియు హుమా ఖురేషి కూడా ముఖ్య పాత్రలు పోషించారు.