National

విషమంగా లాలూ ఆరోగ్యం

బీహార్ మాజీ ముఖ్య‌మంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్ర‌సాద్ యాద‌వ్ ఆరోగ్య ప‌రిస్థితి విష‌మంగా ఉంది. గ‌త వారం లాలూ త‌న ఇంట్లోనే మెట్లు ఎక్కుతుండ‌గా జారి ప‌డ్డారు. దీంతో ఆయ‌న‌ను హుటాహుటిన చికిత్స నిమిత్తం పాట్నాలోని పారాస్ ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. లాలూ భుజం, వెన్నెముక‌కు తీవ్ర గాయ‌మైన‌ట్లు డాక్ట‌ర్లు నిర్ధారించారు. లాలూను సీఎం నితీష్ కుమార్ ఇవాళ ప‌రామ‌ర్శించారు. లాలూ ప్ర‌సాద్ యాద‌వ్‌ను పాట్నా నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించనున్నారు. లాలూ ఆరోగ్యం బుధ‌వారం ఉద‌యం నాటికి మ‌రింత క్షీణించింది. దీంతో ఆయ‌న‌ను ఎయిర్ అంబులెన్స్ ద్వారా ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించ‌నున్నారు. లాలూ ఆరోగ్య ప‌రిస్థితిపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆరా తీశారు. లాలూ కుమారుడు తేజ‌స్వి యాద‌వ్‌కు మోదీ ఫోన్ చేశారు.

దాణా కుంభకోణం కేసులో బెయిల్‌పై ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆదివారం పాట్నాలోని తన ఇంటి మెట్లపై నుంచి పడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. ఆయన బంధువులు, సందర్శకులతో మాట్లాడుతున్నారని ఇంతకు ముందు డాక్టర్లు తెలిపారు. ఎయిర్ అంబులెన్స్‌లో సాయంత్రం 6 గంటలకు ఢిల్లీకి తీసుకెళ్తారని తెలిసింది. యాదవ్‌ వైద్య ఖర్చులను రాష్ట్రమే భరిస్తుందని నితీష్‌ కుమార్‌ అన్నారు.

Related Articles

Back to top button