ఏపీలో బీరు లారీ బోల్తా.. ఎగబడ్డ జనం.. ఎక్కడంటే..!

0
848

శ్రీకాకుళం జిల్లా నుంచి చిత్తూరు జిల్లా మదనపల్లెకు వెళుతున్న బీరు లారీ.. మార్గమధ్యలో ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం మూలగుంటపాడు జాతీయ రహదారి వద్ద బోల్తా పడింది . విషయం తెలుసుకున్న స్థానికులు ఘటనా స్థలానికి వెళ్లి చేతికి అందినకాడికి బీరు సీసాలను పట్టుకెళ్లారు. లారీ డ్రైవర్‌ వారించినా వినకుండా మొత్తం ఎత్తుకుని వెళ్లిపోయారు. 1275 కేసుల బీరు కొంత పగలిపోగా, మరికొంత బీరు సీసాలను అక్కడ ఉన్న ప్రజలు తీసుకుపోయారు. దాదాపు 30 లక్షల రూపాయల నష్టం జరిగింది. పోలీసులు అక్కడికి చేరుకొని కేసు నమోదు చేశారు. లారీ బోల్తా పడిందనే విషయం తెలుసుకున్న స్థానికులు, మందుబాబులు అక్కడి పెద్ద ఎత్తున చేరుకున్నారు. రోడ్డుపై పడిన బీరు సీసాల కోసం స్థానికులు ఎగబడ్డారు. బీర్ బాటిల్స్‌కు జనాలు ఎగబడటంతో అక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. రోడ్డుపై పడిపోయిన పడిన బీర్ బాటిల్స్‌ను జేసీబీ సాయంతో పక్కనే ఉన్న కాలువలోకి తోయించారు.