More

    కశ్మీర్ ప్రీమియర్ లీగ్ విషయంలో పాకిస్తాన్ కు షాక్ ఇచ్చిన బీసీసీఐ

    పాక్ ఆక్రమిత కశ్మీర్ లో కేపీఎల్ (కశ్మీర్ ప్రీమియర్ లీగ్) పేరిట పాకిస్థాన్ ప్రభుత్వం నిర్వహించాలని అనుకుంటున్న క్రికెట్ టోర్నమెంట్ విషయమై భారత ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. ఈ టోర్నీని గుర్తించవద్దంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) తాజాగా ఐసీసీకి లేఖ రాసింది. కశ్మీర్ అంశం భారత్-పాక్ దేశాల నడుమ సుదీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉన్న అంశమని బీసీసీఐ తెలిపింది. ఇలాంటి చోట్ల నిర్వహించే టోర్నీలో పలు దేశాలకు చెందిన క్రికెటర్లు ఆడితే, ఈ ప్రాంతానికి ఒకరకంగా అంతర్జాతీయ ఆమోదం తెలిపినట్టే అవుతుందని బీసీసీఐ తెలిపింది. క్రికెట్ లో భారత క్రికెట్ బోర్డు ఎంతో పవర్ ఫుల్ అనే సంగతి తెలిసిందే..! అందుకే బీసీసీఐ హెచ్చరికల కారణంగా చాలా మంది ఆటగాళ్లు దూరమయ్యారు. ఈ టోర్నీలో ఆడితే భవిష్యత్తులో భారత్‌లో జరిగే క్రికెట్ టోర్నీలతో పాటు క్రికెట్ సంబంధిత వ్యవహారాల్లో ఆడేందుకు, పాల్గొనేందుకు అవకాశం ఉండదంటూ హెచ్చరికలు జారీ చేసిందంటూ వార్తలు కూడా వచ్చాయి. బీసీసీఐ రాసిన లేఖకు ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

    ‘బీసీసీఐకి పాకిస్తాన్‌లో ఎలాంటి రాజకీయ విభేదాలనైనా ఉండొచ్చు. కానీ వాటిని క్రికెట్‌లోకి తీసుకొచ్చి కేపీఎల్ ఆడకూడదని బెదిరించడం సరికాదు. ఒకవేళ కేపీఎల్ ఆడితే, నన్ను భారత్‌లోకి ఏ క్రికెట్ సంబంధిత పనుల కోసం రానివ్వమంటూ హెచ్చరిస్తున్నారు. ఇది దారుణం’ అంటూ ట్వీట్ చేశాడు హర్షల్ గిబ్స్ఆ రు ఫ్రాంచైజీలు కలిగివున్న ఈ టోర్నీ ఆగస్టు 6న ప్రారంభం కానుంది. ఇందులో దక్షిణాఫ్రికా మాజీ స్టార్ హెర్ష్ లే గిబ్స్, లంక దిగ్గజం తిలకరత్నే దిల్షాన్, ఇంగ్లండ్ ఆటగాళ్లు మాంటీ పనేసర్, మాట్ ప్రయర్, విండీస్ ఆటగాడు టినో బెస్ట్ ఆడుతున్నారు.

    భారత్ అల్టిమేటంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పిసిబి) స్పందించింది. భారత క్రికెట్ బోర్డు ‘జెంటిల్‌మన్ ఆట’కు చెడ్డపేరు తెచ్చిందని ఆరోపించింది. ఈ విషయాన్ని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్తామని పాకిస్తాన్ అంటోంది. రిటైర్డ్ క్రికెటర్లు కాశ్మీర్ ప్రీమియర్ లీగ్‌లో పాల్గొనకుండా ఆపాలని భారత్ హెచ్చరికలు జారీ చేయడం ద్వారా ఆట అపఖ్యాతి పాలైందని, క్రికెట్‌కు సంబంధించిన పనుల కోసం వారిని భారతదేశంలోకి అనుమతించబోమని బెదిరించడాన్ని తాము తప్పుబడుతున్నామని పాక్ క్రికెట్ బోర్డు చెబుతోంది.

    బీసీసీఐ అధికారి మీడియాతో మాట్లాడుతూ “ఆటగాళ్లను కాశ్మీర్ లీగ్‌లో పాల్గొనడానికి అనుమతించవద్దని బోర్డులను కోరినప్పటికీ, ఒకవేళ వారు అలా చేస్తే వారు భారతదేశంలో ఎలాంటి క్రికెట్ కార్యకలాపాల్లో భాగం కాలేరని మేము వారికి తెలియజేసాము. జాతీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మేము దీనిని చేశాము . పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) ఆడే వారితో మాకు ఎలాంటి సమస్యలు లేవు కానీ ఇది పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో జరిగే ఒక లీగ్. మేము మా ప్రభుత్వ విధానాన్ని పాటిస్తున్నాము ” అని క్లారిటీ ఇచ్చారు. భారత్ ఎప్పుడూ పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడే ఆటగాళ్లకు ఎటువంటి నిబంధనలను పెట్టలేదు.. ఎంతో మంది ఆటగాళ్లు ఆ టోర్నమెంట్ లోనూ ఆడుతున్నారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ లోనూ ఆడుతున్నారు. భారత భూభాగం విషయంలో పాకిస్తాన్ చేస్తున్న కుట్రలు మరో సారి సాక్ష్యాలతో సహా ప్రపంచం ముందు బయటపడ్డాయి.

    Trending Stories

    Related Stories