More

    సెలెక్షన్ కమిటీపై వేటు వేసిన బీసీసీఐ

    టీ20 వరల్డ్ కప్ లో సెమీస్ లోనే టీమిండియా వెనుదిరిగింది. ముఖ్యంగా టోర్నమెంట్ కు పంపిన జట్టు సెలెక్షన్ లోనే తప్పులు ఉన్నాయని తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీసీఐ) కీలక నిర్ణయం తీసుకుంది. చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ సహా సెలెక్షన్ కమిటీ మొత్తం పైనా వేటు వేసింది. వెంటనే కొత్త సెలెక్టర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. సీనియర్ పురుషుల జట్టును ఎంపిక చేసేందుకు ఐదుగురు సెలెక్టర్లు కావాలని బీసీసీఐ ఆ ప్రకటనలో పేర్కొంది. అందుకోసం కొన్ని అర్హతలు కూడా నిర్దేశించింది. కనీసం 7 టెస్టు మ్యాచ్ లు కానీ, కనీసం 30 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు కానీ, లేక 10 వన్డేలు, 20 ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు ఆడిన వారు కూడా అర్హులు అని వివరించింది. ఆట నుంచి ఐదేళ్ల కిందటే రిటైరై ఉండాలని తెలిపింది. మరే ఇతర క్రికెట్ కమిటీల్లో సభ్యులై ఉండరాదని తెలిపింది. నవంబరు 28వ తేదీ సాయంత్రం 6 గంటల లోపు దరఖాస్తులు సమర్పించాలని బీసీసీఐ స్పష్టం చేసింది.

    Trending Stories

    Related Stories