క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్టు జాబితాను బీసీసీఐ తాజాగా విడుదల చేసింది. 2022-23 సీజన్‌కు చెందిన లిస్టులో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు ఏ ప్లస్ క్యాటగిరీలో చోటు దక్కింది. కేఎల్ రాహుల్‌కు డిమోషన్ దక్కింది. అతన్ని ఏ నుంచి బీ గ్రూపులోకి వేశారు. పలువురు క్రికెటర్లను కాంట్రాక్టు లిస్టు నుంచి తీసేశారు. భువనేశ్వర్ కుమార్, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, వృద్ధిమాన్ సాహా, దీపక్ చాహర్, హనుమ విహారి లాంటి క్రికెటర్లను సెంట్రల్ కాంట్రాక్టు జాబితా నుంచి తీసేశారు. దీపక్ హూడా, కేఎస్ భరత్, హర్షదీప్ సింగ్‌లు.. ప్రస్తుతం గ్రేడ్ సీ క్యాటగిరీలో చోటు దక్కించుకున్నారు. కాంట్రాక్టు ప్రకారం ఏ ప్లస్ క్యాటగిరీ క్రికెటర్లకు ఏడు కోట్లు, ఏ క్యాటగిరీ ఆటగాళ్లకు అయిదు కోట్లు, బీ క్యాటగిరీ క్రికెటర్లకు మూడు కోట్లు, సీ క్యాటగిరీ క్రికెటర్లకు కోటి ఇస్తారు.
గ్రేడ్ ఏ ప్లస్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలు ఉన్నారు.
గ్రేడ్ ఏలో హార్దిక్ పాండ్యా, రవిచంద్రన్ అశ్విన్, షమీ, పంత్, అక్షర్‌లు ఉన్నారు.
గ్రేడ్ బీలో పూజారా, రాహుల్, అయ్యర్, సిరాజ్, సూర్యకుమార్, గిల్ ఉన్నారు.
గ్రేడ్ సీలో ఉమేశ్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, కేఎస్ భరత్,ఇషాన్ కిషన్, దీపక్ హుడా, చాహల్, కుల్దీప్ యాదవ్, సంజూ సాంసన్, వాషింగ్టన్ సుందర్, హర్షదీప్ సింగ్ అన్నారు.