భారత క్రికెటర్లు హలాల్ మాంసం మాత్రమే తినాలనే వార్తలపై క్లారిటీ ఇచ్చిన బీసీసీఐ

0
916

భారత క్రికెట్ జట్టుకు అందించే ఫుడ్‌‌లో ఎలాంటి రూపంలోనూ బీఫ్‌‌, పోర్క్‌‌ కలవకూడదని, హలాల్‌‌ చేసిన మాంసం మాత్రమే అందించాలని బీసీసీఐ మేనేజ్‌‌మెంట్‌‌ ప్రత్యేకంగా తెలిపిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది. హలాల్‌‌ మాంసంను బీసీసీఐ ప్రమోట్​ చేస్తోందని తీవ్ర విమర్శలు వస్తూ ఉన్నాయి. ఈ నిర్ణయాన్ని వెంటనే విత్​డ్రా చేసుకోవాలని డిమాండ్​ చేస్తున్నాయి. న్యూజిలాండ్​తో గురువారం నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్​లో పాల్గొనే ఆటగాళ్లు, సిబ్బంది కోసం తయారు చేసిన డైట్ ప్లాన్​లో.. వారందరూ హలాల్ సర్టిఫైడ్ మాంసాన్ని మాత్రమే తీసుకోవాలని బోర్డు పేర్కొన్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో బీసీసీఐ విధానాన్ని వ్యతిరేకిస్తూ #BCCIPromotesHalal అనే ట్యాగ్‌ను ట్విటర్‌లో నెటిజన్లు ట్రెండ్ చేశారు. హలాల్ మాంసానికి ప్రాధాన్యం ఇవ్వడంపై నెటిజన్లు బీసీసీఐని విమర్శిస్తున్నారు. న్యూజిలాండ్​తో టెస్టు సిరీస్ కోసం ప్రకటించిన జట్టులో కేవలం ఒకే ఒక్క ముస్లిం ఉన్నాడని.. అయినా అందరికీ హలాల్ మాంసాన్ని అందించడమేంటని ప్రశ్నిస్తున్నారు.

బోర్డు ట్రెజరర్ అరుణ్ ధూమల్ మాట్లాడుతూ ఆటగాళ్ల తిండి విషయంలో బీసీసీఐ ఎలాంటి జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. డైటరీ ప్లాన్ అంటూ వస్తున్న కథనాలను కొట్టిపారేసారు. ఆటగాళ్లు తమకు నచ్చిన మాంసం తినొచ్చని, ఈ విషయంలో బోర్డు ఎలాంటి ఆంక్షలు, నిబంధనలు విధించలేదన్నాడు. అసలు డైట్ ప్లాన్ గురించి ఇప్పటి వరకు ఎప్పుడూ చర్చించలేదు. అసలు ఈ నిర్ణయం ఎప్పుడు తీసుకున్నారో కూడా నాకు తెలియదని ఆయన అన్నారు. ఎవరి ఇష్టం మేరకు వారు తమ ఆహారాన్ని తీసుకోవచ్చు. ఈ విషయంలో బీసీసీఐ జోక్యం ఏ మాత్రం లేదు. వెజిటేరియన్, వేగన్, నాన్ వెజిటేరియనా? అనేది ఆటగాళ్ల ఇష్టమని అరుణ్ ధూమల్ అన్నారు.