వెస్టిండీస్‌తో తలపడే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. 16 మంది సభ్యులతో కూడిన జట్టును బుధవారం ప్రకటించింది. గత కొద్ది రోజులుగా జట్టుకు దూరంగా ఉన్న ఓపెనర్ శిఖర్ ధావన్‌ను సెలక్టర్లు ఈ సిరీస్‌కు కెప్టెన్‌గా ఎంపిక చేశారు. రవీంద్ర జడేజాకు వైస్ కెప్టెన్‌గా అవకాశం దక్కింది. దీపక్ హుడా విండీస్‌తో వన్డేలకు ఎంపికయ్యాడు. ఇక జూలై 22న మొదటి వన్డేతో టీమిండియా- వెస్టిండీస్ మధ్య సిరీస్ ఆరంభం కానుంది. గతంలో శ్రీలంకతో సిరీస్ నేపథ్యంలో శిఖర్ ధావన్ టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు.
వన్డే సిరీస్‌కు భారత జట్టు:
శిఖర్ ధావన్(కెప్టెన్), రవీంద్ర జడేజా(వైస్ కెప్టెన్), రుతురాజ్ గైక్వాడ్, శుబ్‌మన్ గిల్, దీపక్ హుడా, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషన్(వికెట్ కీపర్), సంజూ శాంసన్(వికెట్ కీపర్), శార్దూల్ ఠాకూర్, యజువేంద్ర చహల్, అక్షర్ పటేల్, ఆవేశ్ ఖాన్, ప్రసిద్ కృష్ణ, మహ్మద్ సిరాజ్, అర్ష్‌దీప్ సింగ్.
మూడు మ్యాచ్‌లు పోర్ట్ ఆఫ్ స్పెయిన్‌లో జరుగుతాయి. ODIల తర్వాత, కరేబియన్, యునైటెడ్ స్టేట్స్‌లో వెస్టిండీస్‌తో భారత్ ఐదు T20Iలను ఆడనుంది, దీని కోసం జట్టును ఇంకా ప్రకటించలేదు.