హైదరాబాద్: ఖైరతాబాద్‌లోని రాష్ట్ర బిసి కమిషన్ కార్యాలయంలో ‘‘రాజ్యాంగ దినోత్సవం’’ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాజ్యాంగ పీఠికను రాష్ట్ర బిసి కమిషన్ ఛైర్మన్ డా.వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అందరిచేత చదివించారు. ‘‘రాజ్యాంగ పీఠిక’’ మనదేశ జౌన్నత్యానికి ప్రతీక అని అన్నారు. భారత రాజ్యాంగం ఆధునిక ప్రజాస్వామ్య చరిత్రలో విశిష్టమైనది అన్నారు. భావస్వేచ్ఛా ప్రకటన, లౌకికవాదం, అందరికి సమాన హక్కులు, వివక్షరహిత నవసమాజ నిర్మాణాన్ని రాజ్యాంగం కాంక్షించిందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సభ్యులు సి.హెచ్.ఉపేంద్ర, శుభప్రద్ పటేల్ నూలి, కె.కిశోర్గౌడ్లతో పాటుగా కమిషన్ అధికారులు పాల్గొన్నారు. రాజ్యాంగ రచనలో డాక్టర్ బాబాసాహెబ్ బి.ఆర్.అంబేడ్కర్ కృషి అమూల్యమైందన్నారు. రాజ్యాంగం దేశంలోని అన్ని వర్గాల ప్రజల సమున్నతికి, హక్కులు, ప్రయోజనాల విషయంలో భరోసా కల్పిస్తుందని అన్నారు.