National

జన్మాష్టమి రోజు మాంసం దుకాణాల బంద్

సోమవారం శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా నగరంలోని అన్ని మాంసం దుకాణాలను మూసివేయాలని బృహత్ బెంగళూరు మహానగర పాలికే (BBMP) నోటీసు జారీ చేసింది. జాయింట్ డైరెక్టర్ (జంతు సంక్షేమం), BBMP, శ్రీ కృష్ణ జన్మాష్టమి సందర్భంగా 2021 ఆగస్టు 30 న జంతు వధ మరియు మాంసం అమ్మకంపై నిషేధం ఉంటుందని చెబుతూ బహిరంగ సర్క్యులర్ జారీ చేసింది. హిందూ పండుగ సందర్భంగా నగరంలో కబేళాలను మూసివేయాలని బిబిఎంపీ ఆదేశించింది. గతంలో కూడా పలు హిందూ పండుగల సమయంలో బెంగళూరులో జంతువధను నిషేధించారు. రాబోయే హిందూ పండుగల సమయంలో కూడా కబేళాలను మూసి ఉంచేలా చర్యలు తీసుకుంటామని బిబిఎంపీ అధికారులు తెలిపారు. బిబిఎంపీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని హిందువులు స్వాగతిస్తున్నారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

nine − 6 =

Back to top button