More

    ఉప్పాడ, కన్యాకుమారి వద్ద వెనక్కు వెళ్లిన సముద్రం.. ఆందోళనలో ప్రజలు

    ఇటీవల బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా తూర్పు తీర ప్రాంతాల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. బంగాళాఖాతంలో సంభవించిన భూకంపం కారణంగా పలు చోట్ల సముద్రం వెనక్కి వెళ్లిందని పలువురు చెబుతూ ఉన్నారు.

    తమిళనాడులోని కన్యాకుమారిలో కూడా సముద్రం వెనక్కి పోయింది. దీంతో బండరాళ్లు బయటపడ్డాయి. మరోవైపు సముద్రం వెనక్కి వెళ్లడంతో పలుచోట్ల ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. బంగాళాఖాతంలో భూకంపం రావడం, అలలు అసహజంగా ఉండటంతో మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు. సముద్రగర్భంలో తీవ్ర మార్పులు జరిగే సమయంలో అలలు ప్రశాంతంగా ఉంటాయని అంటున్నారు.

    ఆంధ్రప్రదేశ్ లోని అంతర్వేదిలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో ఉన్న అంతర్వేది వద్ద గత కొద్దిరోజులుగా సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. కానీ అక్కడికి దగ్గరగా ఉన్న ఉప్పాడలో సముద్రం ఉన్నట్టుండి రెండు కిలోమీటర్ల మేర వెనక్కి వెళ్లిపోయింది. తూర్పు తీరంలో సముద్రం కొన్ని చోట్ల ముందుకు, మరికొన్నిచోట్ల వెనక్కు వెళ్ళిపోయింది. అంతర్వేదిలో గత నెల రోజులుగా 45 మీటర్ల మేర ముందుకు చొచ్చుకొచ్చింది. సముద్రం ఒడ్డున నిర్మించిన షాపులు కూలిపోయాయి. వారం రోజుల క్రితం సముద్రం 25 మీటర్ల మేర ముందుకొచ్చింది. ఇప్పటి వరకు సముద్రం 45 మీటర్ల మేరకు ముందుకు వచ్చింది. అలల తాకిడి కారణంగా సముద్రం ఒడ్డున ఉన్న భవనం ధ్వంసమైంది. అలల ఉధృతికి కింద నేల కొట్టుకుపోవడంతో భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. 20 ఏళ్లకోసారి సముద్రం ఇలా ముందుకు వెళ్తుందని స్థానికులు చెబుతున్నారు. అంతర్వేదికి 128 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉప్పాడ తీరం వద్ద సముద్ర జలాలు వెనక్కి వెళ్లాయి.

    Trending Stories

    Related Stories