National

ఆరో సారి పెళ్లి చేసుకోబోతున్న సమాజ్‌వాదీ పార్టీ నేత చౌదరి బషీర్

సమాజ్‌వాదీ పార్టీ నేత, మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరవసారి పెళ్లి చేసుకోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మూడో భార్య తనకు న్యాయం కావాలి అంటూ మీడియా ముందుకు వచ్చింది. తనకు ట్రిపుల్ తలాక్ ఇచ్చి ఆరోసారి పెళ్లి చేసుకోబోతున్నాడని ఆయన మూడవ భార్య ఆరోపిస్తోంది. తాజ్‌గంజ్‌లోని గోబర్ చౌకీ నివాసి అయిన నగ్మా గత మూడు సంవత్సరాలుగా తన ఇద్దరు కుమారులతో తన పుట్టింట్లోనే ఉంటోంది. 2012 లో బషీర్‌ను వివాహం చేసుకున్న నగ్మా, బషీర్ కుటుంబ సభ్యులు పెట్టే శారీరక మరియు మానసిక వేధింపులను తాళలేక పోయేది. భర్త కుటుంబం తీరు నచ్చక పుట్టింటికి వెళ్ళిపోయింది.

బషీర్ ఆరవ వివాహం చేసుకుంటున్నాడని తెలుసుకున్న నగ్మా బషీర్ తో మాట్లాడటానికి అతని ఇంటికి వెళ్ళింది. ఆమెను దూషించిన బషీర్ ఇంటి నుండి బయటకు నెట్టివేసి, ఆమెకు ‘ట్రిపుల్ తలాక్’ ఇచ్చాడు. బషీర్‌పై గతంలో మంటోల పోలీస్ స్టేషన్‌లో ఇప్పటికే రెండు ఫిర్యాదులు చేసిన నగ్మా అతనిపై మూడోసారి ఫిర్యాదు చేసింది.

హిందూ మహిళను పెళ్లి చేసుకున్న బషీర్:

హిందూ మహిళను పెళ్లి చేసుకోడానికి బషీర్ హిందువుగా కూడా మారాడు. మహిళలను వివాహం చేసుకోవడానికి బషీర్ గుర్తింపును మార్చినట్లు కూడా నగ్మా ఆరోపించింది. అతడి ఇతర వివాహానికి సంబంధించిన చిత్రాలను నగ్మా మీడియా ముందు ఉంది. ఒక హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి బషీర్ సింధూరాన్ని కూడా ధరించాడని.. తన నుదిటిపై ‘జై మాతా ది’ అంటూ రిబ్బన్ కట్టుకుని కనిపించాడని ఆమె తెలిపింది.

బషీర్ మాట్లాడుతూ తనకు నగ్మాతో ఎలాంటి సంబంధాలు లేవని, ఆమె కారణంగా తాను తరచూ ఇబ్బందుల్లో పడ్డానని చెప్పాడు. వరకట్నం, అసహజ సెక్స్, బెదిరింపులు, వేధింపులకు పాల్పడినట్లు ఆరోపిస్తూ 2013 లో భార్య అతనిపై ఫిర్యాదు చేయడంతో జైలు పాలయ్యాడు.

హింసను ప్రేరేపించడంలో బషీర్ అడుగులు:

మతపరమైన హింసను ప్రేరేపించారని బషీర్ పై ఆరోపణలు ఉన్నాయి. గతంలో బిఎస్పీ లో ఉన్న బషీర్ ను చాలా సార్లు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడొక నేరస్తుడు అనే ముద్రను కూడా వేశారు. మతపరమైన హింసను ప్రేరేపించాడని ఆరోపణలు ఉన్నాయి. 2020 లో అతను అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలను బెదిరించాడు. అక్రమ కబేళాలకు వ్యతిరేకంగా అఖిల భారత హిందూ మహాసభ కార్యకర్తలు నిరసన తెలపగా.. బషీర్ ఒక వీడియోను విడుదల చేస్తూ, మంతోలా జిల్లాలో ప్రవేశించకుండా వారిని హెచ్చరించాడు. మతపరంగా కొన్ని సున్నితమైన వ్యాఖ్యలు చేశాడు. గత సంవత్సరం బక్రీద్ సందర్భంగా ఆ ప్రాంతంలో పశువుల మార్కెట్లను ఏర్పాటు చేయడానికి మంటోలా పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ సమయంలో కూడా బషీర్ కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

3 × 1 =

Back to top button