More

  బాసరలో ఉద్రిక్తత ఇంకా అలాగే..!

  బాసర ఆర్జీయూకేటీ – ట్రిబుల్ ఐటీలో ఉద్రిక్తత కొనసాగుతోంది. వేలాది మంది విద్యార్థులు మెయిన్ గేటు వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. విద్యార్థులకు మద్దతుగా విపక్ష నేతలు, తల్లిదండ్రులు గేటు బయట ఆందోళనకు దిగారు. బాసరకు వచ్చే రహదారుల్లో భారీగా పోలీసులు మోహరించారు. బాసర రైల్వే స్టేషన్ వద్ద ఆందోళన చేస్తున్న నాయకులను అరెస్ట్ చేశారు. క్యాంపస్ నుంచి విద్యార్థులు బయటకు రాకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ హామీ ఇస్తేనే ఆందోళన విరమిస్తామని విద్యార్థులు స్పష్టం చేశారు.

  విద్యార్ధులతో అధికారులు జరిపిన చర్చలు విఫలమయ్యాయి. విద్యార్థుల సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ కూడా ప్రకటించారు. సమస్యల పరిష్కారం కోసం తక్షణం రూ. 12 లక్షలు విడుదల చేస్తామని అధికారులు ప్రకటించారు తాము లేవనెత్తిన 12 డిమాండ్లను పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్ధులు ప్రకటించారు. ఈ నెల 14వ తేదీ నుండి విద్యార్ధులు ఆందోళనలు చేస్తున్నారు. తమ డిమాండ్లతో విద్యార్ధులు ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళన చేస్తున్నారు. బాసరలో ఆందోళన చేస్తున్న విద్యార్ధులకు మద్దతు తెలిపేందుకు వచ్చిన పలు విద్యార్ధి సంఘాల నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

  spot_img

  Trending Stories

  Related Stories