More

    400 ఏళ్ల తర్వాత క్వీన్ కు గుడ్ బై చెప్పిన బార్బడోస్.. గణతంత్ర దేశంగా..!

    మరో దేశం బానిసత్వం నుండి బయట పడింది. 400 ఏళ్ల తరువాత కొత్త గ‌ణ‌తంత్ర దేశంగా బార్బడోస్ ఆవిర్భ‌వించింది. బ్రిటన్ రాణి క్వీన్ ఎలిజిబెత్ బాధ్యతల నుంచి తప్పుకోవటంతో క‌రీబియ‌న్ దీవుల్లోని బార్బ‌డోస్ కొత్త గణతంత్ర దేశంగా అవతరించింది. గత 400 ఏళ్లుగా బార్బడోస్‌ను శాసించిన ద గ్రేట్ బ్రిటన్ పాలనుంచి బార్బడోస్ పూర్తి విముక్తి పొందింది. ప్రపంచంలో కొత్త గణతంత్ర దేశంగా క‌రీబియ‌న్ దీవుల్లోని బార్బ‌డోస్ ఆవిర్భ‌వించింది. బార్బ‌డోస్ బాధ్య‌త‌ల నుంచి రెండ‌వ క్వీన్ ఎలిజ‌బెత్ త‌ప్పుకోవడంతో ఆ దేశానికి పూర్తి స్వాతంత్రం లభించింది. వలస బంధాలను తెంచుకోవడంతో బార్బడోస్ ప్రజల్లో ఆనందం నిండిపోయింది.. పెద్ద ఎత్తున సెలెబ్రేషన్స్ మొదలయ్యాయి.

    గ‌వ‌ర్న‌ర్ జ‌న‌ర‌ల్‌గా ఉన్న డామి సాండ్ర మాస‌న్‌..బార్బ‌డోస్ తొలి అధ్య‌క్షుడ‌య్యారు. కొత్త అధ్య‌క్షుడిగా ప్ర‌మాణ స్వీకారం చేసి డామి సాండ్ర బాధ్య‌త‌లు స్వీక‌రించారు. బార్బడోస్ రాజధాని బ్రిడ్జ్‌టౌన్‌లోని చాంబర్‌లైన్ వంతెనపై వందలాది మంది ప్రజల ఆనందోత్సాహాల మధ్య కొత్త రిపబ్లిక్ పుట్టింది. రద్దీగా ఉండే హీరోస్ స్క్వేర్‌పై బార్బడోస్ జాతీయ గీతం ప్లే చేశారు.

    బార్బడోస్‌ 1625 నుంచి బ్రిటీష్ బానిస‌త్వంలో ఉండిపోయింది. 1966లో ఆ దేశం బ్రిట‌న్ నుంచి స్వాతంత్య్రం పొందింది. కానీ గణతంత్ర దేశంగా అవతరించటానికి నాలుగు శతాబ్దాలు పట్టింది. 400 ఏళ్ల తరువాత గణతంత్ర దేశంగా బార్బడోస్ అవతరించింది. యునైటెడ్ కింగ్‌డమ్, ఆస్ట్రేలియా, కెనడా, జమైకాతో సహా 15 ఇతర రాజ్యాలకు ఇప్పటికీ రాణిగా ఉన్న ఎలిజబెత్ బార్బడోస్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో బార్బడోస్ గణతంత్ర దేశంగా ఆవిర్భవిచింది. ‘ఈ రిపబ్లిక్ సృష్టి ఒక కొత్త ఆరంభాన్ని అందిస్తుందనీ..ప్రిన్స్ చార్లెస్ అన్నారు. 15 వ శతాబ్దం నుంచి 19 వ శతాబ్దం మధ్య 10 మిలియన్లకుపైగా ఆఫ్రికన్లను ఐరోపా దేశాలు బానిసలుగా వచ్చారు. అలా నల్లజాతీయులు బ్రిటీష్ పాలకుల కంబంధ హస్తాల్లో ఉండిపోయారు. రాజ్యాధినేత తొలిగింపు కార్య‌క్ర‌మంలో ప్రిన్స్ చార్లెస్ పాల్గొన్నారు. దీంతో సోమ‌వారం అర్థ‌రాత్రి నుంచి బార్బ‌డోస్‌కు విముక్తి ల‌భించింది.

    Trending Stories

    Related Stories