More

    ప్రముఖ సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లాహిరి ఇక లేరు

    ప్రముఖ గాయకుడు, స్వరకర్త బప్పీ లాహిరి బుధవారం ఉదయం కన్నుమూశారు. PTI నివేదిక ప్రకారం బప్పీ లాహిరి ముంబై ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. ముంబైలోని క్రిటికేర్ హాస్పిటల్ లో 69 సంవత్సరాల వయసులో బప్పీ లాహిరి తుదిశ్వాస విడిచారు. “లాహిరి ఒక నెల పాటు ఆసుపత్రిలో ఉన్నారు. సోమవారం డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం ఆయన ఆరోగ్యం క్షీణించింది. తిరిగి ఆసుపత్రికి తీసుకువచ్చారు. ఆయనకు అనేక ఆరోగ్య సమస్యలు ఉన్నాయి.”అని హాస్పిటల్ డైరెక్టర్ డాక్టర్ దీపక్ నంజోషి PTI కి చెప్పారు. మృతికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

    భారతదేశంలో “డిస్కో కింగ్” అనే పేరు సంపాదించుకున్నాడు బప్పీ లాహిరి. 1952లో పశ్చిమ బెంగాల్‌లోని కలకత్తాలో శాస్త్రీయ సంగీతం సంప్రదాయం ఉన్న కుటుంబంలో జన్మించారు. 19 సంవత్సరాల వయస్సులో సంగీత దర్శకుడిగా తన వృత్తిని ప్రారంభించాడు. ఆయన తండ్రి అపరేష్ లాహిరి ఒక ప్రసిద్ధ బెంగాలీ గాయకుడు, తల్లి బన్సారీ లాహిరి సంగీత విద్వాంసురాలు, గాయని కూడా..! ఆమె శాస్త్రీయ సంగీతంలో బాగా ప్రావీణ్యం సంపాదించారు.

    బప్పీ లాహిరి బెంగాలీ చిత్రం దాదు (1972) ద్వారా తన మొదటి అవకాశాన్ని అందుకున్నాడు. బప్పీ లాహిరి సంగీతం అందించిన మొదటి హిందీ చిత్రం నన్హా షికారి (1973). బాలీవుడ్‌లో జఖ్మీ (1975) సినిమా ద్వారా మంచి పాపులారిటీకి అందుకున్నాడు బప్పీ లాహిరి. 63వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్‌లో బప్పీ లాహిరి ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డును గెలుచుకున్నారు. తెలుగులో కూడా పలు హిట్ సాంగ్స్ అందించాడు. కృష్ణ సింహాసనం సినిమాకు సంగీతాన్ని అందించారు. మెగా స్టార్ చిరంజీవి గ్యాంగ్ లీడర్ మ్యూజిక్ డైరెక్టర్ బప్పీ లాహిరినే..! ఆయన రవి తేజ డిస్కో రాజా సినిమాలో కూడా పాట పాడారు.

    Trending Stories

    Related Stories