బ్యాంకింగ్ రంగంలో జూన్ 1, 2022 నుంచి కొత్త చార్జీలు అమలు కానున్నాయి. ప్రభుత్వ బ్యాంక్ అయిన ఎస్బీఐ హోమ్ లోన్ వడ్డీరేట్ల నుంచి థర్డ్ పార్టీ ఇన్సురెన్స్ ప్రీమియం లోన్ల వరకు అన్నింటిల్లో వినియోగదారులపై భారం పడనుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా..హోమ్ లోన్ ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ లెండింగ్ రేటు 40 బేసిస్ పాయింట్లు పెంచింది. గృహ రుణాలపై వడ్డీ రేటు 7.05 శాతానికి పెరగనుంది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు 6.65 శాతానికి పెరగనుంది. ప్రస్తుత EBLR 6.65 శాతంగా నమోదైంది. RLLR 6.25 శాతంగా ఉంది. శాలరీ అకౌంట్ సర్వీసు రుసుములతో పాటు యాక్సిస్ బ్యాంక్ సేవింగ్స్ ఛార్జీలను పెంచనుంది. సెమీ అర్బన్/గ్రామీణ ప్రాంతాలలోని అకౌంట్‌దారులు నెలవారీ సగటు బ్యాలెన్స్ రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచేశాయి. వాహనాల థర్డ్ పార్టీ మోటార్ బీమా ప్రీమియం పెరగనున్నట్లు రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ నిర్ణయాన్ని వెల్లడించింది. టూవీలర్ వాహనాల్లో ఇంజిన్ సామర్థ్యం 75cc కన్నా తక్కువ ఉంటే ఆ వాహనాలపై బీమా ప్రీమియం రూ.538గా ఉండనుంది. 75cc పైన 150cc లోపు వాహనాలపై రూ.714గా ఉండనుందని తెలుస్తుంది.150cc నుంచి 350cc మించని వాహనాలపై రూ.1366గా, 350cc కన్నా ఎక్కువ సామర్థ్యం ఉండే బైక్‌లకు ప్రీమియం రూ.2,804గానూ ఉండనుంది. 1000cc ఇంజిన్ సామర్థ్యంతో ప్రైవేటు కార్ల ప్రీమియం రూ.2094 వరకు పెరగనుంది. 1000cc పైన 1500cc కలిగిన ఇంజిన్ సామర్థ్యంతో నడిచే ప్రైవేటు కార్ల బీమా ప్రీమియం ధర రూ.3,416కు పెరగనుంది. 1500cc కన్నా ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం కలిగిన కార్ల ప్రీమియం రూ.7,890 వరకు చార్జీలు పెరగనుండి.