More

    వైరల్ అవుతున్న బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రవీణ్ వీడియోలు

    హైదరాబాద్ శివార్లలోని వనస్థలిపురంలోని ఓ బ్యాంకులో రూ.22.53 లక్షలు మాయమవడంతో బ్యాంకు అధికారులు క్యాషియర్ ప్రవీణ్‌పై అనుమానం వ్యక్తం చేశారు. చోరీ జరిగిన మరుసటి రోజు నుంచి కనిపించకుండా పోయిన క్యాషియరే.. డబ్బు దొంగిలించాడని మేనేజర్ చెబుతున్నారు. మంగళవారం మధ్యాహ్నం సమయంలో మేనేజర్ దగ్గకు వెళ్లి ఒంట్లో బాగోలేదు బయటకు వెళ్తానని చెప్పిన క్యాషియర్ నగదు తీసుకొని పారిపోయినట్లు గుర్తించారు. మేనేజర్ ఫిర్యాదు మేరకు పోలీసులు అతడి కోసం గాలిస్తున్నారు. తానే డబ్బు తీసుకెళ్లానని ప్రవీణ్ బ్యాంకు మేనేజర్‌కు మెసేజ్ పెట్టాడని కూడా తెలుస్తోంది. క్రికెట్ బెట్టింగ్‌లో నష్టాలు రావడంతోనే తాను దొంగతనం చేయాల్సి వచ్చిందని.. బెట్టింగ్‌లో డబ్బులు వస్తే.. చోరీ చేసిన సొమ్ము తిరిగి ఇచ్చేస్తానని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని మేనేజర్‌కు క్యాషియర్ మెసేజ్ పెట్టాడని తెలుస్తోంది.

    అయితే ఈరోజు ప్రవీణ్ కొన్ని వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. బ్యాంకు నుండి డబ్బులు తాను తీసుకెళ్ళలేదని క్యాషియర్ ప్రవీణ్ సెల్ఫీ వీడియో పంపాడు. బ్యాంకులో నగదు లావాదేవీల్లో తక్కువగా వచ్చిన నగదును తనపై పడేస్తున్నారని ఆరోపించాడు. గతంలోనూ పలుమార్లు నగదు తక్కువగా ఉండటంపై నిలదీసినా మేనేజర్ పట్టించుకోలేదని తెలిపాడు. బ్యాంకు మేనేజర్ వినయ్ కుమార్ నిర్లక్ష్యం కారణంగానే ఇదంతా జరుగుతోందని, అనవసరంగా తనను బ్లేమ్ చేస్తున్నారని ఆరోపించాడు. బ్యాంకులో సరైన నిఘా లేదని ప్రవీణ్ తెలిపాడు.

    Trending Stories

    Related Stories