జమ్మూకశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో గురువారం నాడు రాజస్థాన్‌కు చెందిన ఓ బ్యాంకు ఉద్యోగిని ఉగ్రవాదులు కాల్చిచంపారు. ఎల్లకీ దేహతి బ్యాంక్ ఉద్యోగి విజయ్ కుమార్‌పై బ్యాంకు ఆవరణలోనే కాల్పులు జరిగాయి. ఆయన్ను ఆస్పత్రికి తరలించగా మార్గమధ్యంలోనే ప్రాణాలు విడిచాడు. కుమార్ కుల్గాం జిల్లాలోని ఏరియా గ్రామ శాఖలో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకు (ఎల్లక్వై దేహతి బ్యాంక్) మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. ఉదయం బ్యాంకులోకి వస్తుండగా తీవ్రవాదులు దాడికి పాల్పడ్డారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. సోదాల కోసం ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టాయి భద్రతా బలగాలు.
రాజస్థాన్‌లోని హనుమాన్‌గఢ్ జిల్లా నివాసి విజయ్ కుమార్. ఇటీవల కుల్గాంలో తన పోస్టింగ్‌లో భాగంగా చేరాడు. ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టామని, దాడికి పాల్పడిన ఉగ్రవాదుల ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని పోలీసులు తెలిపారు. జమ్మూకి చెందిన రజనీ బాలా అనే హిందూ ఉపాధ్యాయిని కుల్గామ్‌లో పాఠశాల వెలుపల ఉగ్రవాదులు చంపిన రెండు రోజులకే ఈ దాడి చోటు చేసుకుంది.