More

    డిసెంబర్ నెలలో బ్యాంకు సెలవులు ఇవే

    డిసెంబర్ నెలలో 12 రోజుల పాటూ బ్యాంకు సెలవులు ఉంటాయట..! ఈ నెలలో బ్యాంకులు 12 రోజులు పని చేయవు. అయితే ప్రాంతాన్ని బట్టి ఈ సెలవులు మారుతూ ఉంటాయి. ఒక రాష్ట్రంలో సెలవు ఉంటే.. మరో రాష్ట్రంలో సెలవు ఉండకపోవచ్చు.రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) నోటిఫికేషన్ ప్రకారం ఈ ఏడాది డిసెంబర్‌లో అన్ని ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ బ్యాంకులు 12 రోజుల వరకు మూసివేయబడతాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వార్షిక జాబితాలో 2021 సంవత్సరానికి సంబంధించిన సెలవుల జాబితాను విడుదల చేసింది. ఈ జాబితా ప్రకారం సెలవులు సిద్ధం చేయబడ్డాయి. క్రిస్మస్‌తో సహా రాష్ట్రాల వారీగా ఏడు వరకు సెలవులు ఉన్నాయి. ఈ నెలలో రెండవ శనివారం వస్తుంది, ఇది బ్యాంకులకు ఇప్పటికే నోటిఫైడ్ సెలవుదినం. కాబట్టి, ఏడు సెలవులు మరియు ఆరు వారాంతపు సెలవులను కలిపితే, డిసెంబర్‌లో బ్యాంక్ సెలవుల సంఖ్య క్రిస్మస్ ఓవర్‌ల్యాప్‌తో కలిపి 12 రోజుల వరకు ఉంటుంది. ఈ సెలవులు ఆదివారాలు మరియు నెలలోని రెండవ మరియు నాల్గవ శనివారాలను కలుపుకొని ఉంటాయి.

    బ్యాంకులు 12 రోజుల పాటు మూసి ఉండబోతున్నందున, మీరు బ్యాంకుకు సంబంధించిన కొన్ని పనులు చేయాలనుకుంటే బ్యాంక్ సెలవులను తప్పనిసరిగా గమనించి ప్లాన్ చేసుకోవాలి. ఈ బ్యాంకు సెలవులు ఎక్కువగా రాష్ట్రాల వారీగా ఉన్నందున ఇది పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మీరు గుర్తుంచుకోవాలి. ఉదాహరణకు సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ పండుగ రోజు డిసెంబర్ 3న గోవాలో బ్యాంకులకు సెలవు ఉంటుంది.. అయితే దేశంలోని ఇతర ప్రాంతాలలో బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. అందుకే, బ్యాంకు సెలవుల గురించి కచ్చితమైన సమాచారం కోసం కస్టమర్‌లు తమ సమీపంలోని బ్రాంచ్‌లో చెక్ చేసుకోవాలని సూచిస్తుంటారు.

    ఆదివారం, శనివారాల్లో బ్యాంకులు పని చేయవు. డిసెంబర్ 5న ఆదివారం, డిసెంబర్ 11న రెండో శనివారం, డిసెంబర్ 12న ఆదివారం, డిసెంబర్ 19న ఆదివారం, డిసెంబర్ 25న నాలుగో శనివారం, డిసెంబర్ 26న ఆదివారం సందర్భంగా బ్యాంకులు పని చేయవు. డిసెంబర్ 3 – సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ ఫీస్ట్ (గోవాలో బ్యాంకులు పని చేయవు)
    డిసెంబర్ 18 – యు సోసో థామ్ వర్ధంతి (షిల్లాంగ్‌లో బ్యాంకులకు సెలవు)
    డిసెంబర్ 24 – క్రిస్మస్ – (షిల్లాంగ్‌లో బ్యాంకులకు హాలిడే)
    డిసెంబర్ 25 – క్రిస్మస్ – దేశవ్యాప్తంగా సెలవు
    డిసెంబర్ 27 – క్రిస్మస్ సెలబ్రేషన్స్ – ఐజ్వాల్‌లో సెలవు
    డిసెంబర్ 30 – యు కియాంగ్ నంగ్బా- షిల్లాంగ్‌లో హాలిడే
    డిసెంబర్ 31 – కొత్త ఏడాది వేడుకలు – ఐజ్వాల్‌లో బ్యాంకులు పని చేయవు

    కాబట్టి ఈ హాలిడేస్ తెలుగు రాష్ట్రాలలో పెద్ద ప్రభావం చూపవని మనం గుర్తించాలి.

    Trending Stories

    Related Stories