ఆ పబ్‌లో మేనేజర్‌ అనిల్‌ కుమార్‌ దే ముఖ్య పాత్ర..?

0
713

బంజారాహిల్స్‌ పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ పబ్‌లో.. డ్రగ్స్ కేసుకు సంబంధించి నిందితులు ఇద్దరిపైన NDPS యాక్ట్‌ -1985 కింద కేసులు నమోదు చేశారు. ఈ డ్రగ్స్‌ కేసులో పబ్‌లో మేనేజర్‌ అనిల్‌ కుమార్‌ దే ముఖ్య పాత్ర అని అంటున్నారు. దాడులకు వెళ్లిన సమయంలో మేనేజర్ అనిల్‌ దగ్గర ఉన్న ట్రేలో అనుమానాస్పద ప్యాకెట్లు గుర్తించి వాటిని సీజ్‌ చేసినట్టు FIRలో పేర్కొన్నారు. స్ట్రాలు పెట్టే ట్రేలో అనుమానాస్పద ప్యాకెట్లు సీజ్ చేశామని.. అవి కొకైన్‌ ప్యాకెట్లు అని పేర్కొన్నారు. 5 డ్రగ్స్‌ ప్యాకెట్లలో మొత్తం 4.64 గ్రాముల కొకైన్ ఉండగా.. దాన్ని సీజ్ చేసి కోర్టుకు సమర్పించారు. ప్రధాన నిందితుడైన అనిల్‌ ఫోన్‌, ఐపాడ్‌ లను సీజ్‌ చేశారు. పార్టీలో డ్రగ్స్ ఆధారాల్ని గుర్తించేందుకు కాల్చిపడేసిన 216 సిగరెట్‌ బట్స్‌ను, కొన్ని టిష్యూలను, టూత్‌పిక్స్‌ లాంటి వాటిని సీజ్‌ చేశారు. ఈ డ్రగ్స్‌తో తనకు సంబంధం లేదని అభిషేక్‌ ఉప్పల పోలీసులకు చెప్తున్నట్టు సమాచారం. అభిషేక్‌ ఐఫోన్‌ను పోలీసులు సీజ్‌ చేశారు. ఆ ఆధారాలన్నీ కోర్టు సమర్పించనున్నారు. పరారీలో ఉన్న అర్జున్‌ వీరమాచినేని కోసం కూడా గాలిస్తున్నారు. పుడింగ్ అండ్‌ మింక్‌- పామ్‌ యాప్‌లో సభ్యులుగా ఉన్న 250 మంది ఎవరనే ప్రశ్నలు కూడా ఉత్పన్నమవుతూ ఉన్నాయి.

ఈ కేసులో నిందితులకు 14 రోజులు రిమాండ్‌ విధించింది నాంపల్లి కోర్టు. అనిల్‌, అభిషేక్ ఉప్పలను రిమాండ్‌కి తరలించారు. డ్రగ్స్ కేసులో అనిల్‌, అభిషేక్‌తో పాటు మరో ఇద్దరి పేర్లు చేర్చారు. పరారీలో ఉన్న కిరణ్‌రాజ్‌, అర్జున్‌ వీరమాచినేని కోసం గాలింపు వేగవంతం చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో A1గా పబ్‌ మేనేజర్‌ అనిల్ పేరు చేర్చారు. A2గా అభిషేక్ ఉప్పల ఉంటే, A3గా అర్జున్ వీరమాచినేని, A4గా కిరణ్‌రాజ్‌ పేర్లను FIRలో నమోదు చేశారు.

బంజారాహిల్స్‌లోని రోడ్‌ నంబర్‌ 6లోని రాడిసన్‌ బ్లూ హోటల్‌లోని పుడ్డింగ్‌ అండ్‌ మింక్‌ అనే పబ్‌ను తెల్లవారుజామున 1:40 గంటలకు తెరిచి ఉండడంతో అక్కడ భారీగా జనం ఉన్నారు. ఆ సమయంలోనూ మందు తాగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. పక్కా సమాచారం అందుకున్న టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులతో కలిసి తెల్లవారుజామున 2 గంటలకు పుడ్డింగ్ & మింక్‌పై దాడి చేయగా.. పబ్ ఆవరణలో 100 మందికి పైగా మద్యం సేవిస్తున్నట్లు గుర్తించారు. బార్ కౌంటర్‌లో డ్రింకింగ్ స్ట్రాలను ఉంచడానికి ఉపయోగించే ప్లాస్టిక్ కంటైనర్‌లలో ఒకదానిలో కొకైన్‌గా అనుమానించబడే తెల్లటి పొడిని కలిగి ఉన్న ఐదు చిన్న ప్యాకెట్లు కనుగొనబడ్డాయి. బంజారాహిల్స్ పోలీసులు ముగ్గురు వ్యక్తులపై ఎన్‌డిపిఎస్ చట్టంలోని సెక్షన్‌లు 8(సి), 22(బి), 29(1) కింద కేసు నమోదు చేశారు. హోటల్ మేనేజర్ అనిల్ కుమార్, అభిషేక్ వుప్పాలను అరెస్ట్ చేశారు. అర్జున్ వీరమాచినేని ప్రస్తుతం పరారీలో ఉన్నారు. పోలీసుల ప్రకారం, పుడ్డింగ్ & మింక్ భాగస్వాములు కొంతమంది ఎలైట్ కస్టమర్లను, వారి అతిథులను మాత్రమే తమ పబ్‌కి యాక్సెస్ చేయడానికి అనుమతిస్తారు. పబ్‌ని తెల్లవారుజాము వరకు నడుపుతున్నారు. పబ్‌లో ప్రతి కస్టమర్ కోసం కోడ్‌ను రూపొందించే యాప్ ఉంది. కస్టమర్‌లు ప్రధాన ద్వారం వద్ద కోడ్‌ను చూపించడం ద్వారా మాత్రమే పబ్‌ లోకి వెళ్ళగలరు.