పాకిస్తాన్ లో క్రికెట్ సిరీస్ లు ఆడడానికి ఎవరూ వెళ్లడం లేదు..! మరో వైపు ఆ దేశం ఇతర దేశాలకు వెళ్లినా కూడా చేసే ఓవరాక్షన్లకు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ వస్తుంటుంది. ఇక బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లిన పాక్ క్రికెట్ జట్టు.. వివాదంలో ఇరుక్కుంది. బంగ్లాదేశ్‌లోని మిర్పూర్ మైదానంలో ప్రాక్టీస్ సెషన్‌లో పాకిస్తాన్ క్రికెట్ జట్టు తమ జాతీయ జెండాను ఎగురవేసి పెద్ద వివాదానికి నాంది పలికింది. పాకిస్తాన్ జట్టు నవంబర్ 19 నుండి మూడు T20Iలు మరియు రెండు టెస్టులు ఆడేందుకు బంగ్లాదేశ్ పర్యటనలో ఉంది. అయితే ప్రాక్టీస్ కు కూడా పాక్ జెండాను తీసుకుని రావడం పట్ల బంగ్లాదేశ్ అభిమానులు తమ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆగ్రహించిన బంగ్లాదేశ్ పౌరులు ఈ చర్యలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. పాక్ క్రికెట్ జట్టు క్షమాపణ చెప్పాలని లేదా రెండు దేశాల మధ్య సిరీస్‌ను రద్దు చేయాలని బంగ్లాదేశ్ పౌరులు తెలిపారు. మ్యాచ్‌లకు ముందు జట్టు మొత్తం శిక్షణ పొందుతున్న మైదానంలో పాక్ జెండాను నాటిన ప్రాక్టీస్ సెషన్ చిత్రాలను PCB అధికారిక మీడియా హ్యాండిల్ పోస్ట్ చేయడంతో వివాదం మొదలైంది.
వివిధ దేశాలు బంగ్లాదేశ్‌కు లెక్కలేనన్ని సార్లు వచ్చాయి.. ప్రాక్టీస్ చేస్తూ చాలా మ్యాచ్‌లు ఆడారు. కానీ ఏ పార్టీ కూడా తమ జాతీయ జెండాను నేలపై పాతిపెట్టడం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. కానీ పాకిస్తాన్ ఎందుకు అలా చేసింది…. ఏమిటో సూచిస్తోంది అంటూ నెటిజన్లు అనుమానాలను వ్యక్తం చేశారు.
అయితే తమ చర్యను పాకిస్తాన్ క్రికెట్ జట్టు సమర్థించుకుంది. దీన్ని కోచ్ సక్లైన్ ముస్తాక్ పరిచయం చేశారని పేర్కొంది. పాకిస్తాన్ ప్రధాన కోచ్ సక్లైన్ ముస్తాక్ తన క్రికెటర్ల మనోధైర్యాన్ని పెంచడానికి శిక్షణా సమయంలో జాతీయ జెండాను తీసుకెళ్లే ధోరణిని ప్రారంభించాడు. UAEలో ఇటీవల జరిగిన ICC T20 ప్రపంచ కప్ 2021లో కూడా పాక్ ఇదే తీరులో ప్రవర్తించింది. ఆస్ట్రేలియాతో ఆడిన సెమీ-ఫైనల్స్‌లో పాక్ ఓటమిని ఎదుర్కొని.. టోర్నమెంట్ నుండి వైదొలిగింది.