More

    ఇఫ్తార్ పార్టీ అని హిందువులను కూడా పిలిచారు.. బీఫ్ వడ్డించారు

    బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ (BNP) గురువారం (ఏప్రిల్ 28) సాయంత్రం ఇఫ్తార్ పార్టీని నిర్వహించింది. ఆ పార్టీకు హిందువులను కూడా ఆహ్వానించారు. 20 మందికి పైగా ముస్లిమేతరులు ఉన్నారు. ఆ పార్టీలో బీఫ్ (గోరుర్ మాంగ్షో) వడ్డించినందుకు వివాదాస్పదమైంది. సిల్హెట్ జిల్లాలోని దక్షిణ సుర్మాలోని చొండిపుల్‌లోని కుషియారా ఇంటర్నేషనల్ కన్వెన్షన్ హాల్‌లో BNP సిల్హెట్ యూనిట్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇఫ్తార్ పార్టీ ప్రారంభానికి ముందు భోజనాన్ని ప్రతి కుర్చీ ముందు ఉంచేశారు. వంటలలో బీఫ్ కర్రీ, చోలే, వడలు, ఖర్జూరం, బంగాళదుంప కట్లెట్ (ఆలూ చాప్) ఉన్నాయి. ఇఫ్తార్ విందును కవర్ చేయడానికి పలువురు ముస్లిమేతర జర్నలిస్టులు కూడా హాజరయ్యారు. అయితే వారెవరికీ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేదు.

    అందరికీ ముస్లిం సభ్యుల మాదిరిగా వారికి కూడా బీఫ్ కూర వడ్డించారు. అయితే హిందువులు ఆ వడ్డించిన భోజనం తినలేదు. బీఎన్పీకి చెందిన పలువురు హిందూ నాయకులు తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. కొంతమంది పార్టీ సభ్యులు ఈ ఘటనపై తీవ్ర విమర్శలు చేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నాయకుడు మోంటు నాథ్.. ఇఫ్తార్‌ పార్టీని ఇతర మతాలకు చెందిన వ్యక్తులు స్వీకరించలేకపోయారు. సిల్హెట్‌లో జరిగిన BNP కార్యక్రమంలో ముస్లిమేతరులకు ఆహారం అందించడానికి ఎలాంటి ఏర్పాటు చేయలేదని విమర్శలు గుప్పించారు.

    Trending Stories

    Related Stories