More

    దక్షిణాఫ్రికా చేతిలో బంగ్లాదేశ్ చిత్తు

    దక్షిణాఫ్రికా చేతిలో బంగ్లాదేశ్ ఘోర ఓటమిని చవి చూసింది. సూపర్-12లో భాగంగా జరిగిన మ్యాచ్ లో 104 పరుగుల తేడాతో దక్షిణాఫ్రికా ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా జట్టులో రైలీ రుసోవ్ చెలరేగాడు. కేవలం 52 బంతుల్లోనే అతను సెంచరీ పూర్తి చేశాడు. ఈ వరల్డ్‌కప్‌లో ఇదే తొలి సెంచరీ కావడం విశేషం. రైలీ రుసోవ్ ఇన్నింగ్స్ లో ఎనిమిది ఫోర్లు, ఏడు సిక్సర్లు ఉన్నాయి. సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత రూసో భారీ షాట్‌కు ప్రయత్నించి షకీబ్‌ బౌలింగ్‌లో క్యాచ్‌ అవుట్ అయ్యాడు. రైలీ రుసోవ్ మొత్తం 109 రన్స్‌ చేసి నిష్క్రమించాడు. ఇక దక్షిణాఫ్రికా నిర్ణీత ఓవర్లలో అయిదు వికెట్ల నష్టానికి 205 రన్స్‌ చేసింది. తొలుత టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ ఎంచుకున్నది. రెండో వికెట్‌కు డికాక్‌, రైలీ రుసోవ్ మధ్య 163 రన్స్‌ భాగస్వామ్యం నమోదైంది. డీకాక్‌ 38 బంతుల్లో 63 రన్స్‌ చేశాడు. ఆఖరి ఐదు ఓవర్లు బంగ్లాదేశ్ బౌలర్లు చాలా బాగా బౌలింగ్ చేయడంతో దక్షిణాఫ్రికా అనుకున్నదానికంటే 30 పరుగులు తక్కువ చేసింది.

    లక్ష్య ఛేదన లో బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ విఫలమవడంతో 101 పరుగులకు ఆలౌట్ అయింది. 16.3 ఓవర్ల వద్ద బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ ముగిసింది. నొర్కియా 3.3 ఓవర్లలో 10 పరుగులు ఇచ్చి 4 వికెట్లు తీసి బంగ్లాదేశ్ పతనాన్ని శాసించాడు. బంగ్లాదేశ్ బ్యాట్స్మెన్ లో లిట్టన్ దాస్ 34 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. రైలీ రుసోవ్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.

    Trending Stories

    Related Stories