International

ఓ వైపు హిందువులు చనిపోతుంటే.. మరోవైపు హిందువుల వాయిస్ వినిపించకుండా చేస్తున్నారు

బంగ్లాదేశ్ లో హిందువులపై ఇటీవల ఎన్నో దారుణాలు, దాడులు చోటు చేసుకున్నాయి. దుర్గా పూజ రోజున ఓ ఫేస్ బుక్ రూమర్ కారణంగా హిందువులపై ముస్లింలు పెద్ద ఎత్తున దాడులకు పాల్పడ్డారు. పదుల సంఖ్యలో మరణించగా.. వందల సంఖ్యలో గాయపడ్డారు. హిందువుల ఇళ్లను కూడా తగులబెట్టడంతో చాలా మంది నిరాశ్రయులు అయ్యారు. ఎన్నో దేవాలయాల మీద దాడులకు పాల్పడ్డారు.. విధ్వంసాన్ని సృష్టించారు. బంగ్లాదేశ్‌లోని హిందూ మైనారిటీ కమ్యూనిటీ దుర్గా పూజ చేసుకుంటూ ఉండగా.. కొన్ని గ్రూపులు వచ్చి మండపాలను ధ్వంసం చేశాయి. ఖురాన్‌ను హిందువులు అవమాన పరిచినట్లుగా ఫేస్‌బుక్ లో ఓ పోస్ట్ గత బుధవారం రాత్రి సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత కొందరు మతోన్మాదులు వీధుల్లోకి వచ్చి అనేక దుర్గా మండపాలను ధ్వంసం చేశారు.

దసరా రోజున ఇస్కాన్ దేవాలయంపై దాడి చేసి విధ్వంసాన్ని సృష్టించారు. నౌఖాలీ జిల్లాలో ఇస్కాన్ దేవాల‌యంపై దుండ‌గులు దాడి చేసి విధ్వంసానికి దిగారు. భ‌క్తుల‌పైనా దాడి చేశారు. గాయ‌ప‌డిన భక్తుల ప‌రిస్థితి విష‌మంగా ఉంద‌ని ఇస్కాన్ నిర్వాహకులు తెలిపారు. ఆలయానికి నష్టం వాటిల్లిందని, ఒక భక్తుడి పరిస్థితి విషమంగా ఉందని ఇస్కాన్ దేవాలయం ట్విట్టర్‌లో చెప్పుకొచ్చింది. బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ తమ ట్విట్టర్ ఖాతాలో హిందువులపై జరుగుతున్న దారుణాలకు సంబంధించిన సమాచారాన్ని షేర్ చేసుకుంది.

తగలబడుతున్న ఇల్లులు, హిందువులపై దాడులు వంటివి షేర్ చేసిన బంగ్లాదేశ్ కు చెందిన ఖాతాలను ట్విట్టర్ నిలిపివేసింది. బంగ్లాదేశ్ ఇస్కాన్ ఖాతాను, బంగ్లాదేశ్ హిందూ యూనిటీ కౌన్సిల్ ట్విట్టర్ ఖాతాను నిలిపివేశారు. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతూ ఉన్నాయి. హిందువులపై పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంటూ ఉండగా.. వాయిస్ ను వినిపించే గొంతులను ట్విట్టర్ నొక్కేస్తోందని భారత్ కు చెందిన పలువురు ఆరోపించారు. ఆ ట్విట్టర్ ఖాతాలను తిరిగి పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ నేత వినీత్ గోయెంకా ఈ విషయంపై ట్వీట్ చేశారు. బంగ్లాదేశీ హిందువుల వాయిస్ బయటకు రాకుండా ట్విట్టర్ చూస్తోందని అన్నారు. దీనిపై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ, భారత హోమ్ మినిస్టర్ అమిత్ షాకు ఫిర్యాదు చేశారు.

Related Articles

Back to top button