More

    బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

    టీఆర్ఎస్ నేత, మంత్రి కేటీఆర్.. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ పై పరువు నష్టం దావా వేశారు. అందుకు సంబంధించి తన న్యాయవాది చేత బండి సంజయ్ కి నోటీసులు పంపించారు కేటీఆర్. ఈనెల 11వ తేదీన ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పైన నిరాధారమైన ఆరోపణలు బండి సంజయ్ చేశారని నోటీసుల్లో పేర్కొన్నారు. బండి సంజయ్ చేసిన ఆరోపణలకు సంబంధించి ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ కోరాలని డిమాండ్ చేశారు కేటీఆర్. క్షమాపణలు చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తానని అని హెచ్చరించారు మంత్రి కేటీఆర్. ఈ మేరకు ఈ రోజు నోటీసులు జారీ చేశారు కేటీఆర్ న్యాయవాది.

    మంత్రి కేటీఆర్ గారి పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని.. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించలేదని విమర్శించారు. కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు. క్షమాపణలు చెప్పకుంటే.. మంత్రి కేటీఆర్ గారి పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని తన నోటీసుల్లో న్యాయవాది పేర్కొన్నారు.

    Trending Stories

    Related Stories