More

    మేమున్నాం.. భయపడొద్దు: బండి సంజయ్

    తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్‎పై బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా భైంసా సమీపంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‎పై తీవ్ర విమర్శలు గుప్పించారు. భైంసాకు రావాలంటే పర్మిషన్ తీసుకోవాలా అని బండి ప్రశ్నించారు. మనం ఏ రాష్ట్రం, ఏ దేశంలో ఉన్నామని ప్రశ్నలు సంధించారు. భైంసాకు భరోసా కల్పించాడానికే ప్రజాసంగ్రామ యాత్ర చేపట్టినట్లు చెప్పారు. అధికారంలోకి వచ్చాక భైంసా పేరును మహిశాగా మారుస్తామన్నారు. హిందూ వాహిని కార్యకర్తలపై పెట్టిన పీడీయాక్ట్‌లు కొట్టేస్తామన్నారు. భైంసాలో హిందూ సమాజం భయపడాల్సిన అవసరం లేదని, బీజేపీ వారికి అండగా ఉంటుందని బండి సంజయ్ తెలిపారు.

    మిగులు నిధులతో ఇచ్చిన తెలంగాణను కేసీఆర్ అప్పుల పాటు చేశారని మండిపడ్డారు. బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల కోసం బీజేపీ ఎంతకైనా తెగించి పోరాడేందుకు సిద్ధంగా ఉందని, అక్కడి కాంట్రాక్టర్ కేసీఆర్ చుట్టం కాబట్టే విద్యార్థులపై అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే మరో రూ.5లక్షల కోట్లు అప్పులు చేస్తారని పేర్కొన్నారు. రాష్ట్రంలోని పేదలందరికీ ఉచిత విద్య, వైద్యం అందిస్తామని బీజేపీ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. బీజేపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు బీజేపీ సిద్ధంగా ఉందన్నారు. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు.

    కేసీఆర్ పతనం ప్రారంభమైంది .. కిషన్‎రెడ్డి
    తెలంగాణలో సీఎం కేసీఆర్ పతనం ప్రారంభమైందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో .. కేసీఆర్ ఒక్క ఎంపీ సీటైనా గెలుస్తారా.. అని ప్రశ్నించారు. వెయ్యి మంది కేసీఆర్ లు వచ్చినా.. వెయ్యి మంది అసదుద్దీన్ ఒవైసీలు వచ్చినా మోదీ నాయకత్వాన్ని అడ్డుకోలేరన్నారు. ఈ సభలో సీనియర్ నేతలు ఈటల రాజేందర్, సోయం బాపూరావుతో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.

    Trending Stories

    Related Stories