బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారు

0
816

తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 12న కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో పాదయాత్రను ప్రారంభించనున్నారు. సెప్టెంబర్ 22న ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట ఔటర్ రింగ్ రోడ్డు సమీపంలో పాదయాత్ర ముగించనున్నట్లు బీజేపీ ప్రతినిధులు తెలిపారు. కుత్బుల్లాపూర్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, సికింద్రాబాద్–కంటోన్మెంట్, మల్కాజ్ గిరి, మేడ్చల్, ఉప్పల్, ఎల్బీ నగర్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర కొనసాగనుంది.

10 రోజుల పాటు 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 115 కిలోమీటర్ల మేర సంజయ్ పాదయాత్ర చేయనున్నారు. ఈ నెల 17న పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించే తెలంగాణ విమోచన దినోత్సవాలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకాబోతుండడంతో ఆ రోజు పాదయాత్ర ఉండదని తెలిపారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర తెలంగాణ లోని బీజేపీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పలువురు నాయకులు ప్రజా సంగ్రామ యాత్రలో భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఇంకెంత మంది బీజేపీలో చేరుతారో అనే ఉత్కంఠ కూడా కొనసాగుతూ ఉంది.