బీజేపీ చీఫ్ బండి సంజయ్ యాత్రకు అనుమతి నిరాకరణ.. తీవ్ర ఆగ్రహం

0
648

తెలంగాణలో బీజేపీ చీఫ్ బండి సంజయ్ తలపెట్టిన ఐదో విడత పాదయాత్రను తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. శాంతి భద్రతల దృష్ట్యా ఈ పాదయాత్రకు అనుమతి ఇవ్వలేమని నిర్మల్ పోలీసులు చెప్పారు. ఆదివారం రాత్రి కరీంనగర్ నుంచి భైంసా వెళ్తుండగా.. బండి సంజయ్‌ను కోరుట్ల సమీపంలో పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్.. వాగ్వాదానికి దిగారు. మరోవైపు కార్యకర్తలు సైతం ఆందోళన చేయటంతో.. కోరుట్ల వద్ద కొంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పాదయాత్రకు అనుమతి లేదని చెప్పిన పోలీసులు, బండి సంజయ్‌ను బలవతంగా కరీంనగర్‌లోని ఆయన ఇంటికి తరలించారు. భైంసాకు వెళ్లకుండా అడ్డుకోవటంపై బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఎట్టి పరిస్థితుల్లో భైంసాకు వెళ్లి తీరుతామని.. న్యాయస్థానం తలుపు తడతామన్నారు. పాదయాత్రకు ముందు అనుమతిచ్చి.. ఇప్పుడు సడెన్‌గా ఎందుకు రద్దు చేశారని బండి సంజయ్ ప్రశ్నించారు. భైంసా సున్నితమైన ప్రాంతం అంటున్నారు. అదేమైనా నిషేధిత ప్రాంతమా..? వెళ్లకూడదా..? భైంసాని కాపాడలేని సీఎం కేసీఆర్ ఇక రాష్ట్రాన్ని ఏం కాపాడుతారని బండి ప్రశ్నించారు.