బండి సంజయ్ పాదయాత్ర వాయిదా..!

0
736

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ పాదయాత్ర వాయిదా పడింది. ఆగష్టు 24 నుంచి ప్రారభించాల్సిన ‘ప్రజా సంగ్రామ యాత్ర’ను ఈ నెల 28కి వాయిదా పడింది. బీజేపీ సీనియర్‌నేత, మాజీ సీఎం, మాజీ గవర్నర్‌ కల్యాణ్‌సింగ్‌ మృతి నేపథ్యంలో పార్టీ పరంగా సంతాపదినాలు పాటిస్తున్నందున పాదయాత్రను వాయిదా వేసినట్లు తెలంగాణ బీజేపీ విభాగం అధికారికంగా వెల్లడించింది. తొలుత ఈ పాదయాత్రను ఆగస్ట్‌ 9 నుంచి మొదలుపెట్టాలని నిర్ణయించగా..పార్లమెంట్ సమావేశాలకు ఎంపీలు ఖచ్చితంగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేయడం, మరోవైపు పార్లమెంట్ సమావేశాల తర్వాత కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆశీర్వాద యాత్ర నేపథ్యంలో బండి సంజయ్‌ పాదయాత్ర వాయిదా పడింది. ఈ నెల 24 నుండి బండి సంజయ్ పాదయాత్ర మొదలవుతుందని తెలిపారు. కల్యాణ్‌సింగ్‌ మరణంతో నాలుగురోజుల పాటు మరోసారి పాదయాత్ర వాయిదా పడింది.

ఆదివారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన బండి సంజయ్‌ ఈ అంశంపై చర్చించారు. ఈనెల 28 శనివారం ఉదయం తొమ్మిదన్నర గంటలకు చారి్మనార్‌ వద్ద భాగ్యలక్ష్మీ దేవాలయం నుంచి పాదయాత్రను ప్రారంభించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఈ సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్య దర్శి తెలంగాణ ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, బీజేపీ శాసనసభాపక్ష నాయకుడు రాజాసింగ్‌లతో పాటు పార్టీ సీనియర్‌ నాయకులు పాల్గొన్నారు.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్ మాజీ సీఎం కల్యాణ్‌సింగ్‌ భౌతిక‌కాయానికి ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ నివాళుల‌ర్పించారు. ఆదివారం ఉద‌యం ఢిల్లీ నుంచి ప్ర‌త్యేక విమానంలో ల‌క్నోలో నేరుగా కల్యాణ్‌సింగ్‌ నివాసానికి వెళ్లారు. ఆయ‌న పార్థివదేహానికి న‌మస్క‌రించారు. కల్యాణ్‌సింగ్‌ జ‌న సంక్షేమాన్నే త‌న జీవిత మంత్రంగా చేసుకున్నారని.. ఆయ‌న యూపీతోపాటు దేశ అభివృద్ధికి పాటుప‌డ్డారని.. నిజాయితీ, మంచి పాల‌న‌తో పేరు సంపాదించారు అని మోదీ ఈ సంద‌ర్భంగా అన్నారు. పలువురు భారతీయ జనతా పార్టీ ప్రముఖులు కూడా కల్యాణ్ సింగ్ కు నివాళులు అర్పించారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

3 − 2 =