అట్టర్ ఫ్లాప్ సినిమాకు ఐటం సాంగ్ జోడించారు: బండి సంజయ్

0
763

టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామాలో తమ ప్రమేయం లేదన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. ఈ వ్యవహారంలో కేసీఆర్ ప్రమేయం ఉంది కాబట్టే నా సవాల్‎ను స్వీకరించకుండా పారిపోయాడన్నారు. కేసీఆర్ చేసిన తప్పులు, దోచుకున్న, దాచుకున్న సొమ్ము పాపం ఊరికే పోదన్నారు. త్వరలోనే సీఎం కుటుంబ రాజకీయ జీవిత చరిత్ర సమాధి కాబోతోందన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై నిగ్గు తేల్చేందుకు సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేసీఆర్‎కు ముమ్మాటికీ ప్రమేయం ఉందని ఆరోపించారు. ఒకవేళ కేసీఆర్‎కు ప్రమేయం లేకుంటే లై డిటెక్టివ్ పరీక్షలకు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కేసీఆర్‎తో పాటు ఈ వ్యవహారంలో ఉన్న ఎమ్మెల్యేలు సిద్ధమా? అడ్డగోలుగా మాట్లాడుతున్న మంత్రులు, కుటుంబ సభ్యులు సైతం లైడిటెక్టివ్ పరీక్షలకు సిద్ధం కావాలని సవాల్ విసిరారు. కేసీఆర్‎కు దమ్ముంటే ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని లేఖ రాయాలని డిమాండ్ చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి పాదాల చెంత పార్టీ రాష్ట్ర ఉఫాధ్యక్షుడు డాక్టర్ మనోహర్‎రెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్, అధికార ప్రతినిధి జె.సంగప్ప, వీరేందర్‎గౌడ్, యువమోర్చా అధ్యక్షుడు భాను ప్రకాశ్‎లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

17 + sixteen =