మునుగోడులో శనివారం జరిగిన టీఆర్ఎస్ బహిరంగ సభలో సీఎం కేసీఆర్ భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే..! కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులపైనా.. రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయాలపైనా కేసీఆర్ తన వాయిస్ ను వినిపించారు.
సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. మునుగోడు సభలో కేసీఆర్ అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెబుతామని సంజయ్ అన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడంతోనే ఆగేది లేదన్న సంజయ్.. మునుగోడు సభలో కేసీఆర్ అవినీతి చిట్టా విప్పుతామని కూడా చెప్పారు. కేసీఆర్‌కు ప్రస్తుతం మునుగోడు భయం పట్టుకుందని.. అందుకే శనివారం నాటి మునుగోడు సభలో తానేం మాట్లాడుతున్నానన్న విషయాన్ని మరచి కేసీఆర్ ప్రసంగించారని అన్నారు.
మునుగోడులో ఆదివారం సాయంత్రం జరగనున్న బీజేపీ బహిరంగ సభకు అమిత్ షా హాజరుకానున్నారు. కాంగ్రెస్ పార్టీకి, మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షా సమక్షంలో బీజేపీలో చేరనున్నారు.