More

    బండి సంజయ్ హౌస్ అరెస్ట్

    తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. తెలంగాణలో ఆర్టీసీ ఛార్జీల పెంపును నిరసిస్తూ.. సికింద్రాబాద్‌లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద ఆందోళనకు ఆయన పిలుపునిచ్చారు. అయితే బండి సంజయ్ అక్కడకు వెళ్లకుండా పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధంలో ఉంచారు. బంజారాహిల్స్‌లోని సంజయ్ నివాసాన్ని దిగ్బంధించిన పోలీసులు.. ఆయన బయటకు రాకుండా అడ్డుకున్నారు. బండి సంజయ్‌ను హౌస్ అరెస్ట్ చేశారనే సమాచారంతో బీజేపీ శ్రేణులు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకుంటున్నాయి. పోలీసుల తీరుపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ ఛార్జీల పెంపుతో సామాన్యుడిపై భారం వేశారని.. జేబీఎస్‌లో నిరసన చేసి తీరుతామని చెబుతున్నారు.

    Trending Stories

    Related Stories