More

    కేసీఆర్‎పై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడాల్సిందే.. మరోసారి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

    టీఆర్‎ఎస్ సర్కార్, కేసీఆర్‎పై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‎పై ఉన్న పాత కేసులన్నీ తిరగదోడాల్సిందేనన్నారు. నిర్మల్ జిల్లాలో బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఈ సందర్భంగా కుంటాల మండలం ఓలా గ్రామంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. లిక్కర్, డ్రగ్స్, పేకాట దందా చేసేటోళ్ల అంతు చూస్తామన్నారు. కేసీఆర్ కుటుంబాన్ని వదిలిపెట్టే ప్రసక్తేలేదన్నారు. టీఆర్ఎస్ నేతలు డ్రగ్స్ దందా చేస్తున్నారని, డ్రగ్స్ కేసులో ఐదుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారని తెలిపారు. బెంగళూరు పోలీసులను మేనేజ్ చేసి కేసును మూసివేయించారని, ఆ కేసును మళ్లీ బయటకు తీస్తామన్నారు. తప్పు చేసిన ఎవ్వరినీ వదిలేది లేదని బండి సంజయ్‌ హెచ్చరించారు.

    ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవిత ప్రమేయం ఉందని అన్నారు. కేసీఆర్, కేసీఆర్ కుటుంబం వేల కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని ఆరోపించారు.

    Trending Stories

    Related Stories