More

    అక్కడ బెల్టు షాప్‎లకు సీఎం కెసిఆర్ పేరు..!

    తెలంగాణ సీఎం కెసిఆర్‎కు రోజుకో సమస్య తప్పడం లేదు. టిఆర్ఎస్ ప్రభుత్వం ఇరుకున పడుతోంది. తాజాగా పంజాబ్ రైతులకు ఇచ్చిన చెక్కులు బౌన్స్ కావడంతో సీఎం కేసీఆర్‌ను చూసి దేశమంతా నవ్వుకుంటోందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. లిక్కర్, క్యాసినో దందాల్లో కేసీఆర్ బిడ్డ వేల కోట్ల పెట్టుబడులు పెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నవి బెల్ట్ షాపులు కాదని.. అవి కేసీఆర్ షాపులని అన్నారు. ముఖ్యమంత్రి 100 రూములతో ఇల్లు కట్టుకున్నారని, 300 ఎకరాల్లో వ్యవసాయం చేస్తూ కోట్లు గడిస్తున్నారని అన్నారు. రైతులు మాత్రం అప్పుల పాలవుతున్నారని తెలిపారు. హైదరాబాద్ చుట్టుపక్కల కోట్ల రూపాయల విలువైన జాగలను కబ్జా చేసేందుకే ‘ధరణి తెచ్చారని విమర్శించారు. తెలంగాణ రైతులను పట్టించుకోని కేసీఆర్…. పంజాబ్ రైతులకు మాత్రం మూడు లక్షల రూపాయల ఆర్థిక సాయం చేశారని.. చివరికి ఆ చెక్కులు బౌన్స్ అవడంతో తెలంగాణ ఇజ్జత్ పోయిందన్నారు. పేదోళ్ల సమస్యలు, బాధలను తెలుసుకోవాలని ప్రధాని మోదీ ఆదేశిస్తేనే… పాదయాత్ర చేస్తున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు.

    ఐతే నిర్మల్ జిల్లాలో ఆయన ఐదో విడత ప్రజాసంగ్రామ యాత్ర కొనసాగుతోంది. ఆయనకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. బండి సంజయ్ ను కలిసి తమ సమస్యలను చెప్పుకుంటున్నారు.

    Trending Stories

    Related Stories