More

    బీఎల్ సంతోష్‎పై కెసిఆర్ కుట్రను బయటపెట్టిన బండి సంజయ్..!

    దేశం కోసం, హిందూ ధర్మ రక్షణ కోసం పాటు పడుతున్న ప్రచారక్ బీఎల్ సంతోష్‎పై సీఎం కేసీఆర్ అక్రమంగా బనాయించిన వ్యవహారం తేలిపోయిందని బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ స్పష్టం చేశారు. కేసీఆర్ తన కూతురు కవిత జైలుకు వెళ్తుందనే భయంతో ఏం చేయాలో తెలియని అయోమయంలో ఉన్నారని ఎద్దేవా చేశారు. తన కుటుంబం మీద ఉన్న కేసులను పక్కదారి పట్టించేందుకు బీఎల్ సంతోష్‎ను అక్రమంగా కేసులో ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. సిట్ దాఖలు చేసిన పిటిషన్‎పై హైకోర్టు తీర్పు కేసీఆర్ చెంప చెళ్లుమనిపించిందని చెప్పారు. సిట్ దాఖలు చేసిన ఎఫ్ఐఆర్ ను కొట్టివేయడంతో కేసీఆర్ కుట్ర తేలిపోయిందని వెల్లడించారు.

    నిర్మల్ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్ర ఐదో విడత కొనసాగుతోంది. యాత్రలో భాగంగా 10వ రోజు ఖానాపూర్‎లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో బండి సంజయ్ మాట్లాడారు. తెలంగాణ వస్తే గల్ఫ్ బాధితులకు ఊరట కలిగించేలా చర్యలు తీసుకుంటామని చెప్పిన సీఎం ఇప్పటి దాకా ఏమీ చేయలేదని ఆరోపించారు. పైగా గల్ఫ్ వలసలు పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల పాల్జేశాడని మండిపడ్డారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిన కేసీఆర్‎కు వచ్చే ఎన్నికల్లో బుద్ది చెప్పాలని కోరారు. కేంద్రం ప్రజల మౌలిక సదుపాయాలు, అభివృద్ధికి నిధులు ఇస్తే.. ఆ పనుల్లో కేసీఆర్ కుటుంబం కమీషన్లు పంచుకుంటోందని ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చాక అన్నీ కక్కిస్తామని అన్నారు. కేసీఆర్ మోసాలు ఇక సాగనివ్వకుండా ప్రతి ఒక్కరూ చైతన్యం కావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు.

    Trending Stories

    Related Stories