మీ ఎమ్మెల్యేలు రక్తపరీక్షలకు రెడీనా..? డ్రగ్స్ మాఫియా లింకులపై బండి సంజయ్ సవాల్?

0
783

”అసెంబ్లీలో కరోనా టెస్ట్‌ లకు బదులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్‌ లు చేయాలి. కర్ణాటక డ్రగ్స్‌ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో కేసీఆర్‌కు తెలుసు. వారితో వెంటనే రాజీనామా చేయించాలి. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారు. డ్రగ్స్ టెస్ట్‌కు నేను సిద్ధంగా ఉన్నా. మీ ఎమ్మెల్యేలు బ్లడ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా?.” అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

కర్ణాటక డ్రగ్స్ కేసు అటు ఇటు తిరుగుతూ.. ఊహించని విధంగా.. ఇటీవల తెలంగాణ ఎమ్మెల్యేలు హస్తం కూడా ఇందులో ఉందనే వార్తలు వచ్చేదాకా వచ్చింది. దీంతో రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఈ అంశం మారిపోయింది. సాగర్ ఎన్నికలు కూడా దగ్గరపడుతున్న క్రమంలో ఈ ఎమ్మెల్యేల డ్రగ్స్ రాకెట్ వ్యవహారం.. ప్రతిపక్షాలకు పవర్ ఫుల్ ఆయుధంలా మారేలా చేసింది.

ఇప్పటికే ఓ ఎమ్మెల్యేకు సంబంధించి ఆధారాలు దొరియాయని, త్వరలోనే కర్నాటక పోలీసులు నోటీసులు పంపిస్తారని కూడా తెలుస్తోంది. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలపైనా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. డ్రగ్స్ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో సీఎం కేసీఆర్‌కు తెలుసని.. వారికి డ్రగ్స్ టెస్ట్‌ లు చేయించే దమ్ముందా అని సవాల్ విసిరారు.

”అసెంబ్లీలో కరోనా టెస్ట్‌ లకు బదులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు డ్రగ్స్ టెస్ట్‌ లు చేయాలి. కర్ణాటక డ్రగ్స్‌ కేసులో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరో కేసీఆర్‌కు తెలుసు. వారితో వెంటనే రాజీనామా చేయించాలి. మంత్రులు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు డ్రగ్స్ దందా చేస్తున్నారు. డ్రగ్స్ టెస్ట్‌కు నేను సిద్ధంగా ఉన్నా. మీ ఎమ్మెల్యేలు బ్లడ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నారా?.” అని బండి సంజయ్ సవాల్ విసిరారు.

బెంగళూరులో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్ పెడ్లర్స్‌ తో హైదరాబాద్‌కు చెందిన సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డి అనే వ్యక్తులకు సంబంధాలు ఉన్నట్లు తేలింది. వీరు తెలంగాణకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలకు డ్రగ్స్ సరఫరా చేసినట్లు విచారణలో వెల్లడయింది. ప్రస్తుతం ఈ వ్యవహారంపై కర్ణాటక పోలీసులు కూపీ లాగుతున్నారు.

బెంగళూరు నుంచి వచ్చేటప్పుడు తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే ఓ వ్యక్తి హైదరాబాద్‌కు కొకైన్ తీసుకొచ్చాడని తెలిసింది. ఆ డ్రగ్స్‌ తో హైదరాబాద్ శివారులో ఫామ్‌హౌస్‌లో పార్టీలు చేసుకున్నారని, ఆ పార్టీలకు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారని బెంగళూరు పోలీసులు తెలిపారు. అలా పలుమార్లు బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు అతడు డ్రగ్స్ తరలించాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల ప్రమేయంపై పోలీసులు ఆరాతీస్తున్నారు. ఇప్పటికే ఓ ఎమ్మెల్యేకు సంబంధించి ఆధారాలు దొరికాయని.. త్వరలోనే నోటీసులు జారీచేయనున్నట్లు తెలిసింది. సందీప్ రెడ్డి, కలహర్ రెడ్డితో పాటు తెలంగాణ ఉద్యమకారుడిగా చెప్పుకునే వ్యక్తికి కర్నాటక పోలీసులు నోటీసులు జారీచేశారు. కానీ ఇప్పటి వరకు వారు స్పందించలేదు. ఈ నేపథ్యంలో బీజేపీ నేత బండి సంజయ్ కామెంట్స్ పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశంగా మారాయి.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

6 + twelve =