More

  కేసీఆర్ కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా: బండి సంజయ్

  ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ చీఫ్.. ఎంపీ బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ కు సంస్కారం లేదని, దేశ ప్రధానిని ఉద్దేశించి మాట్లాడే మాటలేనా అవి అని ప్రశ్నించారు. కేసీఆర్ కు అహంకారం తలకెక్కిందని, అందుకే బీజేపీని, ప్రధాని మోదీని ఉద్దేశించి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారని అన్నారు. కేసీఆర్ జోగులాంబ అమ్మవారిని కూడా తిట్టేలా, వ్యంగ్యంగా మాట్లాడటం దారుణంగా ఉందన్నారు. ఇలా మాట్లాడే బదులు రాజకీయాలు వదిలేసి ఇంట్లో ఉండిపోవాలన్నారు. కేసీఆర్ దేవుళ్లను తిడతారు, ధర్మాన్ని తిడతారు. సిగ్గుండాలి. కేసీఆర్ వెంటనే హిందూ సమాజానికి క్షమాపణ చెప్పాలి. లేకుంటే ప్రజలు టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడం, డ్రైనేజీలో కలపడం ఖాయమన్నారు.

  హైదరాబాద్ ను ఇస్తాంబుల్, లండన్, సింగపూర్ చేస్తామన్న మాటలు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తారనే ప్రజల దృష్టిని మళ్లించేందుకు కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ లో ఏక్ నాథ్ షిండే వంటి గట్టి నేతలు ఉన్నారని.. అది తెలిసే కేసీఆర్ భయపడుతున్నారని, ఆ పేరును పదే పదే ఎత్తుతున్నారని అన్నారు బండి సంజయ్. కేసీఆర్ కు, మోదీకి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందన్నారు. మోదీ రోజుకు 18 గంటలు పని చేస్తారని.. కేసీఆర్, ఫామ్ హౌస్ కు వెళితే రోజులకు రోజులు బయటికే రారన్నారు. మైనర్ బాలికలపై అత్యాచారం జరిగితే.. ఒక్కరిని కూడా పట్టుకుని శిక్షించలేకపోతున్నారు. అదే బీజేపీ ప్రభుత్వం ఉన్న యూపీలో క్రిమినల్స్ జైలు లోంచి బయటికి రావడానికి భయపడుతున్నారన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బండి సంజయ్ హెచ్చరించారు.

  spot_img

  Trending Stories

  Related Stories