Telugu States

యాంకర్ రఘు అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బండి సంజయ్

జర్నలిస్టు, యాంకర్ రఘును మొదట ఎవరో కిడ్నాప్ చేశారని భావించారు. హైదరాబాద్ లో తొలి వెలుగు యాంకర్ రఘును కిడ్నాప్ చేశారనే వార్తలు ప్రచారం అయ్యాయి. మల్కాజిగిరిలో రఘు నివాసానికి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్లారని.. నెంబర్ ప్లేట్ లేని జీపులో ఎక్కించి.. రఘు తలకు ముసుగు కప్పి, చేతులు కట్టి బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. గుర్రం పోడు గిరిజన భూముల అధికార పార్టీ అక్రమాలపై రఘు ఓ జర్నలిస్ట్‌గా అనేక కథనాలు అందించాడు. కోకాపేట కాందిశీకుల భూమి, ఐకియా ముందున్న భూమి, ఐడిపిల్ భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై కథనాలను ప్రసారం చేయడంతో గతకొన్ని రోజులుగా అతనికి బెదిరింపు కాల్స్ కూడా వచ్చాయని తెలుస్తోంది.

అయితే రఘును అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. రఘును హుజూర్ నగర్ పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారు. గుర్రం పోడు తండా ఘర్షణను ప్రోత్సహించమే వ్యవహరించమే కాదు పోలీసులపై దాడులకు కారణమయ్యాడని రఘుపై పలు సెక్షన్ ల కింద కేసు నమోదయ్యాయి. మల్కాజిగిరిలోని నివాసంలో రఘును పోలీసులు అరెస్ట్ చేసి.. అతన్ని హుజూర్ నగర్ కు తరలించిన పోలీసులు జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరు పర్చారు. అతడికి జడ్జి 14రోజులు రిమాండ్ విధించగా.. పోలీసులు హుజూర్ నగర్ జైలుకు తరలించారు.

రఘు అరెస్టుపై తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్ జర్నలిస్ట్ రఘు అరెస్టును ఖండిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు. సమాజంలో ప్రభుత్వ లోపాలని ఎత్తి చూపితే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తారా ? అని ప్రశ్నించారు. హుజూర్ నగర్ నియోజకవర్గం గుర్రంపోడు తండా గిరిజన భూముల్ని అధికార పార్టీ నేతలు ఆక్రమిస్తే,ఆ కబ్జా భాగోతాన్ని మీడియాలో కవర్ చేసినందుకు ఆయనపై కేసు పెట్టారని బండి సంజయ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపడమే మీడియా బాధ్యత అని.. కానీ అక్రమ కేసులతో మీడియా గొంతును మూయించాలని ఈ ప్రభుత్వం భావిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలనకు ఇది నిదర్శనమని, అధికార పార్టీ నేతల కబ్జాలపై వార్తలు రాస్తే కేసులు పెడతామని కేసీఆర్ సర్కారు సంకేతాలను ఇస్తోందని అన్నారు. వాస్తవాలను రాసే జర్నలిస్టులపై కేసులు పెడితే జైళ్లన్నీ వాళ్లతోనే నిండిపోతాయని, అందుకు కేసీఆర్ సిద్ధంగా ఉన్నారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. ప్రజాస్వామ్యానికి 4వ పిల్లర్ అయిన మీడియా ప్రతినిధులపై ఈ అమానుష చర్యలేంటని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ సాధనలో జర్నలిస్టుల పాత్ర కూడా ఎంతో ఉందని, అలాంటిది రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకుని 24 గంటలు గడవకముందే ఒక సీనియర్ పాత్రికేయుడ్ని కిడ్నాప్ తరహాలో అరెస్ట్ చేస్తారా? అని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

20 − 16 =

Back to top button