రేడియంట్ భూముల విషయంలో ఎంపీ వేంరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఏదేదో చెబుతున్నారని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి మండిపడ్డారు. విశాఖను దోచుకుంటున్నారని, అలా దోచేస్తే తాము చూస్తూ ఉరుకోబోమన్నారు. తమను జైలుకి పంపినా న్యాయ పోరాటంపై వెనకడుగు వేయమన్నారు. స్వయంగా సీఎం జగన్‌రెడ్డి తమ్ముడు అనిల్‌రెడ్డి క్యాపిటల్ ఎక్స్ ప్రొజెక్టు పేరుతో పెద్ద భూమాయకు దిగారని అన్నారు. విశాఖలో పారిశ్రామికవేత్తలను బెదిరించి ఆస్తులు లాక్కుంటున్నారని ఆరోపించారు. ఎందుకు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షాను బదిలీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.