More

    కోర్టు చెప్పిందొకటి.. వైసీపీ చెబుతోంది మరొకటి.. సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు: మాజీ మంత్రి బండారు

    రాజధాని అమరావతిపై హైకోర్టు గతంలో స్పష్టమైన తీర్పు ఇచ్చిందని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి అన్నారు. టైమ్ కు సంబంధించిన అంశంపై స్టే సుప్రీంకోర్టు ఇచ్చిందని, కాని రాజాధాని మార్చాలంటే పార్లమెంటుకు వెళ్లాలని చర్చ వచ్చిందని చెప్పారు. విశాఖ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి బండారు సత్యనారయణ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కోర్టు చెప్పిందొకటి అయితే వైసీపీ నేతలు చెబుతోంది మరొకటి అని విమర్శించారు. ప్రజలను మభ్యపెట్టేవిధంగా వైసీపీ నేతలు వక్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్పీకర్ తమ్మినేని సిగ్గులేకుండా తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని, మూడు రాజధానులపై క్లియరెన్స్ ఇచ్చిందా చెప్పు అని ప్రశ్నించారు. దోచుకున్న భూములన్నీ అమ్మకాలు అవుతున్నాయని, వాటిని అమ్ముకునేందుకు కోర్టు తీర్పుని వక్రీకరిస్తున్నారని అన్నారు. నిజంగా కోర్టు అనుకూలంగా ఉంటే ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదని నిలదీశారు. నేరుగా ధైర్యంగా ప్రజల్లోకి వెళ్లలేని సీఎం జగన్.. అత్యధిక సీట్లు గెలిపించిన రాయలసీమ వాళ్ళని మోసం చేస్తున్నాడని అన్నారు.

    Trending Stories

    Related Stories