More

    హర్యానా గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన దత్తాత్రేయ

    హ‌ర్యానా గ‌వ‌ర్నర్‌గా సీనియర్ నేత బండారు ద‌త్తాత్రేయ ప్రమాణం చేశారు. సత్యదేవ్ నారాయణ్ ఆర్య నుంచి బాధ్యతలు స్వీకరించారు. హ‌ర్యానా హైకోర్టు ప్రధాన న్యాయ‌మూర్తి ర‌వి శంక‌ర్ ఝా, ద‌త్తాత్రేయతో ప్రమాణ స్వీకారం చేయించారు. హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌గా బండారు ద‌త్తాత్రేయ గురువారం ప్ర‌మాణం చేశారు. ద‌త్తాత్రేయ చేత హ‌ర్యానా హైకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ర‌వి శంక‌ర్ ఝా ప్ర‌మాణం చేయించారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్‌తో పాటు ప‌లువురు మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా గ‌వ‌ర్న‌ర్ ద‌త్తాత్రేయ‌కు చీఫ్ జ‌స్టిస్ ర‌వి శంక‌ర్, సీఎం మ‌నోహ‌ర్ లాల్ ఖ‌ట్ట‌ర్ శుభాకాంక్ష‌లు తెలిపారు. 2019లో ద‌త్తాత్రేయ హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌వ‌ర్న‌ర్‌గా నియ‌మితులయ్యారు. రెండేండ్ల అనంత‌రం ద‌త్తాత్రేయ‌ను హ‌ర్యానా గ‌వ‌ర్న‌ర్‌గా కేంద్రం ఇటీవ‌లే నియ‌మించింది. అదే సమయంలో ఏపీ బీజేపీ నేత, విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబును మిజోరం గవర్నర్‌గా ఇటీవల నియమించారు. మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూభాయ్‌ ఛగన్‌భాయ్ పటేల్‌, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్ర విశ్వనాథ్‌, కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌, గోవా గవర్నర్‌గా పీఎస్‌ శ్రీధరన్‌ పిళ్లై, ఝార్ఖండ్‌ గవర్నర్‌గా రమేష్ బైస్‌‌‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది.

    కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు రాష్ట్రాలకు నూతన గవర్నర్లను నియమించింది.. మరికొందరిని బదిలీ చేసింది. ఈ క్రమంలో 2019లో హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. ఈ క్రమంలో నేడు దత్తన్న హర్యానా 18వ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించారు.

    Trending Stories

    Related Stories