More

    జాకీర్ నాయక్ సంస్థపై నిషేధం పొడిగింపు

    జాకీర్ నాయక్.. తన స్పీచ్ లతో ఎంతో మంది భారతీయుల్లో విద్వేషాలు నెలగొల్పిన వ్యక్తి.. తీవ్రవాదులకు సహాయం చేశాడనే ఆరోపణలు రావడంతో అరెస్టులను తప్పించుకోడానికి భారత్ ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇక జాకీర్ నాయక్ కు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై భారత ప్రభుత్వం ఆంక్షలను విధిస్తూ వస్తోంది. తాజాగా ఆ సంస్థపై మరో ఐదేళ్ల పాటు నిషేదిస్తున్నట్లు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం జాకీర్ మలేసియాలో ఉన్నారు. చట్ట విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారంటూ 1967 చట్ట ప్రకారం.. 2016లో తొలిసారిగా ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై నిషేదాన్ని ప్రకటించారు. 2016వ సంవత్సరం నవంబర్ 17న కేంద్ర ప్రభుత్వం చట్టవిరుద్ధమైన కార్యకలాపాల (నివారణ) చట్టం 1967 (37 ఆఫ్ 1967) ప్రకారం చట్టవిరుద్ధమైన సంస్థగా ప్రకటించింది. జాకీర్ నాయక్ చేసిన ప్రకటనలు, ప్రసంగాలు అభ్యంతరకరమైనవని, వీటి ద్వారా అతను మతాల మధ్య శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహిస్తున్నాడని కేంద్రం పేర్కొంది. జాకీర్ అబ్దుల్ కరీమ్ నాయక్ అలియాస్ జాకీర్ నాయక్ మతం పేరుతో ఇతర మతస్థులపై ద్వేషం పెంచుతున్నారని.. పలు మతాల మధ్య, కమ్యూనిటీల మధ్య బేధాభిప్రాయాలు వచ్చేలా చేస్తున్నారని కేంద్ర ప్రభుత్వం అభిప్రాయపడింది. దేశ క్షేమం కోసం, సెక్యూరిటీ కోసం మరో అయిదు సంవత్సరాల పాటూ ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ పై నిషేదాన్ని పొడిగిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది.

    ఇప్పటికే జాకీర్ నాయక్ పై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్రిమినల్ కేసు నమోదు చేసింది. ఉగ్రవాదసంస్థలతో సంబంధాలు కలిగి ఉన్నారన్న ఆరోపణలను ఎదుర్కొంటున్నారు. రెచ్చగొట్టే ప్రసంగాలతో యువతను ఉగ్రవాదం వైపు నడిపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. జాతీయ దర్యాప్తు సంస్థ జకీర్ పై ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. ఈడీ ఆయనపైనా, ఆయనకు చెందిన ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థ పైనా కూడా క్రిమినల్ కేసు నమోదు చేసింది. జాకీర్ కొన్ని సంవత్సరాలుగా విదేశాల్లోనే ఉంటున్నాడు. భారత్ వస్తే అరెస్టు చేస్తారన్న భయంతో అతను రావడం లేదు. అంతర్జాతీయ శాటిలైట్ టీవీ నెట్‌వర్క్, ఇంటర్నెట్, ప్రింట్, సోషల్ మీడియా ద్వారా ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలకు చేరేలా జాకీర్ నాయక్ మత ప్రచారం నిర్వహించిన సంగతి తెలిసిందే..! మతం ముసుగులో తీవ్రవాదానికి కూడా మద్దతు తెలిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. బంగ్లాదేశ్ లోని ఢాకాలో జరిగిన ఉగ్రదాడిలో పాల్గొన్న ఒక ఉగ్రవాది తాను జకీర్ నాయక్ ప్రసంగాలు విని ఉత్తేజితమయ్యానని కూడా చెప్పాడు. మతపరమైన బేధాలు సృష్టించి, దేశ విద్రోహ సెంటిమెంట్లను లేవనెత్తుతున్నారని.. వాటికి ఆకర్షితులై కొందరు దేశ భద్రతను విస్మరిస్తున్నారు.

    ప్రస్తుతం జాకీర్ నాయక్ మలేషియాలో తలదాచుకుంటూ ఉన్నాడు. 2019లో, హిందువులు మరియు చైనీస్ మలేషియన్లపై జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన జాకీర్ మలేషియాలో ప్రసంగాలు చేయకుండా నిషేధించారు. ఇదే విషయమై అతడిని గంటల తరబడి విచారించారు. మనీలాండరింగ్‌కు సంబంధించిన కేసుల్లో జకీర్ నాయక్ భారత్‌ కు మోస్ట్ వాంటెడ్ కూడా అయ్యాడు.

    Trending Stories

    Related Stories