International

‘పాకిస్తాన్ జిందాబాద్’ అనే కాలర్ ట్యూన్ ను పెట్టుకోవాలట

పాకిస్తాన్ నుండి విడిపోవాలని బలూచిస్తాన్ ప్రజలు ఎప్పటి నుండో కోరుకుంటూ ఉన్నారు. అయితే అక్కడి ప్రజల వాయిస్ ను పాకిస్తాన్ ఎప్పటికప్పుడు తొక్కేస్తూ ఉంది. తాజాగా బలూచిస్తాన్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. పాకిస్తాన్ లోని బలూచిస్తాన్ ప్రభుత్వం సీనియర్ అధికారులు మరియు వివిధ విభాగాల అధిపతులు తమ మొబైల్ ఫోన్ రింగ్‌బ్యాక్ టోన్‌ను “పాకిస్తాన్ జిందాబాద్” గా సెట్ చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. “పాకిస్తాన్ జిందాబాద్” అనే కాలర్ ట్యూన్ ను అడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీలు, అదనపు సెక్రటరీలు ఇతర సభ్యులు పెట్టుకోవాల్సిందేనని చీఫ్ సెక్రటరీ అధ్యక్షతన ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇంటర్నెట్‌లో ఆర్డర్ కాపీ అందుబాటులో ఉంది. రింగ్‌బ్యాక్ టోన్ లేదా కాలర్ ట్యూన్ అన్నది కాల్ చేసే వారు రింగ్ బ్యాక్ చేస్తున్నప్పుడు వినిపించే వాయిస్. రింగింగ్ సౌండ్ బదులుగా ‘పాకిస్తాన్ జిందాబాద్’ అని వినిపించాలట..! అయితే టెలికాం ఆపరేటర్లు కస్టమర్‌లకు డిఫాల్ట్ టోన్ స్థానంలో కస్టమ్ టోన్‌లను సెట్ చేయడానికి అనుమతిస్తారు.

ఉత్తర్వులో పేర్కొన్న సంబంధిత అధికారులందరు వీటిని పాటించాలని కోరారు.ఎస్ & జిఎడి యొక్క అదనపు కార్యదర్శులు తమ మొబైల్ ఫోన్ నంబర్‌లకు ఇదే రింగ్‌బ్యాక్ టోన్‌లను వర్తింపజేసేలా చూసుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. సీనియర్ అధికారుల రింగ్‌బ్యాక్ టోన్‌ల విషయంలో బలూచిస్తాన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పలువురు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఎంతో మంది ట్విట్టర్‌లో పోస్టులను పెట్టారు.

ఇటీవల బలూచిస్తాన్ లో జిన్నా విగ్రహాన్ని పేల్చి వేయడంతో తాజా ఉత్తర్వులు వచ్చాయి. పాకిస్తాన్ వ్య‌వ‌స్థాప‌కుడు మొహ‌మ్మ‌ద్ అలీ జిన్నా విగ్ర‌హాన్ని పేల్చి వేశారు. బ‌లూచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న కోస్ట‌ల్ న‌గ‌రం గ్వ‌దార్‌లో ఉన్న జిన్నా విగ్ర‌హాన్ని బాంబు దాడితో పేల్చేశారు. జూన్ నెల‌లో మెరైన్ డ్రైవ్ వ‌ద్ద ఆ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. విగ్ర‌హం కింద పేలుడు ప‌దార్ధాల‌ను పెట్టి పేల్చిన‌ట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఈ ఘ‌ట‌న సెప్టెంబ‌ర్ 26వ తేదీన జ‌రిగింది. ఆ విగ్ర‌హాన్ని తామే పేల్చిన‌ట్లు బ‌లోచ్ రిప‌బ్లిక‌న్ ఆర్మీ నేత బాబ్గ‌ర్ బ‌లోచ్ తెలిపారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఉన్న‌త స్థాయి విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు గ‌ద్వార్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ అబ్దుల్ క‌బీర్ ఖాన్ తెలిపారు. టూరిస్టుల రూపంలో వ‌చ్చిన కొంద‌రు దుండ‌గులు విగ్ర‌హాన్ని బాంబు పెట్టి పేల్చార‌ని పాక్ అధికారులు చెప్పారు. బలూచ్ ప్రజలు జిన్నాను తమ నాయకుడిగా గుర్తించలేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకున్నారు. పాకిస్తాన్ నైరుతి సరిహద్దులోని ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ 1947 నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ఉంది. వారి భూభాగంపై రాజకీయ హక్కులు, స్వయంప్రతిపత్తి, నియంత్రణను కోరుతోంది. పాకిస్తాన్ సైన్యం కొన్నేళ్లుగా బలూచిస్తాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. సామూహిక హత్యలు, అపహరణలు లాంటి ఎన్నో దారుణాలకు గత కొన్ని సంవత్సరాలుగా పాక్ ప్రభుత్వం పాల్పడింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

5 + thirteen =

Back to top button