More

  మొహమ్మద్ అలీ జిన్నా విగ్రహాన్ని బాంబులతో పేల్చి వేశారు

  పాకిస్తాన్ వ్య‌వ‌స్థాప‌కుడు మొహ‌మ్మ‌ద్ అలీ జిన్నా విగ్ర‌హాన్ని పేల్చి వేశారు. బ‌లోచిస్తాన్ ప్రావిన్సులో ఉన్న కోస్ట‌ల్ న‌గ‌రం గ్వ‌దార్‌లో ఉన్న జిన్నా విగ్ర‌హాన్ని బాంబు దాడితో పేల్చేశారు. జూన్ నెల‌లో మెరైన్ డ్రైవ్ వ‌ద్ద ఆ విగ్ర‌హాన్ని ప్ర‌తిష్టించారు. విగ్ర‌హం కింద పేలుడు ప‌దార్ధాల‌ను పెట్టి పేల్చిన‌ట్లు పాకిస్తాన్ మీడియా తెలిపింది. ఈ ఘ‌ట‌న సెప్టెంబ‌ర్ 26వ తేదీన జ‌రిగింది. జిన్నా స్టాచ్యూ పూర్తిగా ధ్వంస‌మైంది. ఆ విగ్ర‌హాన్ని తామే పేల్చిన‌ట్లు బ‌లోచ్ రిప‌బ్లిక‌న్ ఆర్మీ నేత బాబ్గ‌ర్ బ‌లోచ్ తెలిపారు. ఈ ఘ‌ట‌న ప‌ట్ల ఉన్న‌త స్థాయి విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు గ‌ద్వార్ డిప్యూటీ క‌మిష‌న‌ర్ అబ్దుల్ క‌బీర్ ఖాన్ తెలిపారు. టూరిస్టుల రూపంలో వ‌చ్చిన కొంద‌రు దుండ‌గులు విగ్ర‌హాన్ని బాంబు పెట్టి పేల్చార‌ని క‌బీర్ ఖాన్ చెప్పారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎటువంటి అరెస్టు జ‌ర‌గ‌లేద‌న్నారు.

  ఆదివారం ఉదయం జరిగిన పేలుడులో మహ్మద్ అలీ జిన్నా విగ్రహం పూర్తిగా ధ్వంసమైంది. పాకిస్తాన్ ఆంగ్ల దినపత్రిక డాన్ నివేదిక ప్రకారం ఈ ఏడాది జూన్‌లో మెరైన్ డ్రైవ్‌ లో విగ్రహాన్ని ఏర్పాటు చేయగా.. పేలుడు పదార్థాలను విగ్రహం కింద ఉంచి పేల్చివేశారు. బలూచ్ లిబరేషన్ ఫ్రంట్ యోధులు పర్యాటకులుగా నటిస్తూ ఈ ప్రాంతంలోకి ప్రవేశించారని చెప్పారు. గ్వాదర్‌లోని క్వాయిద్-ఇ-ఆజమ్ విగ్రహాన్ని కూల్చివేయడం పాకిస్తాన్ భావజాలంపై దాడి అని.. జియారత్‌లోని క్వాయిద్-ఇ-ఆజమ్ రెసిడెన్సీపై దాడి చేసిన వారిలాగే ఈ నేరస్థులను కూడా శిక్షించాలని నేను అధికారులను అభ్యర్థిస్తున్నాని సర్ఫరాజ్ బుగ్తి ట్వీట్ చేశారు. బలూచ్ ప్రజలు జిన్నాను తమ నాయకుడిగా గుర్తించలేదని పేర్కొంటూ సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకున్నారు.

  https://twitter.com/BeebagrBaloch3/status/1442016177534996481

  బలూచిస్తాన్లో జరిగిన మరో పేలుడులో కనీసం నలుగురు పాక్ భద్రతా సిబ్బంది మరణించారు, ఇద్దరు గాయపడ్డారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ ఈ పేలుడుకు పాల్పడింది. బలూచిస్తాన్ ప్రావిన్స్‌లోని పాకిస్తాన్ పారామిలిటరీ బలగాలను లక్ష్యంగా చేసుకుని ఈ పేలుడు జరిగినట్లు ఒక అధికారి తెలియజేశారు. బలూచిస్తాన్‌లోని హరనై జిల్లాలోని ఖోసత్ ప్రాంతంలో ఫ్రాంటియర్ కార్ప్స్ వాహనంపై దాడి జరిగింది. పాకిస్తాన్ నైరుతి సరిహద్దులోని ప్రావిన్స్ అయిన బలూచిస్తాన్ 1947 నుండి స్వాతంత్య్రం కోసం పోరాడుతూ ఉంది. వారి భూభాగంపై రాజకీయ హక్కులు, స్వయంప్రతిపత్తి, నియంత్రణను కోరుతోంది.

  పాకిస్తాన్ సైన్యం కొన్నేళ్లుగా బలూచిస్థాన్‌లో మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోంది. సామూహిక హత్యలు, అపహరణలు గత కొన్ని సంవత్సరాలుగా పాక్ ప్రభుత్వం ఎన్నో దారుణాలకు పాల్పడింది. బలూచ్‌లపై యుద్ధం చేయడానికి పాకిస్తాన్ అమెరికా ప్రభుత్వం సరఫరా చేసిన ఆయుధాలను ఉపయోగించింది.

  Trending Stories

  Related Stories