National

హిందువులు మైనార్టీలుగా ఉన్న చోట.. లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా

హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రాంతాల్లో ఆలయాలకు లౌడ్ స్పీకర్లను భజరంగదళ్ అందిస్తూ ఉంది. గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్ లో భజరంగ్ దళ్ ఈ పనులకు శ్రీకారం చుట్టింది. సూరత్ లో హిందువులు మైనార్టీలుగా ఉన్న ప్రాంతాలలో హనుమాన్ చాలీసా వినిపించే విధంగా లౌడ్‌స్పీకర్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించింది. రోజుకు రెండుసార్లు హనుమాన్ చాలీసా పారాయణంపై దేశవ్యాప్త ఉద్యమాన్ని ప్రారంభించే ఉద్యమానికి భజరంగదళ్ శ్రీకారం చుట్టింది.

సూరత్‌లో హిందువులు మైనార్టీలుగా 21 ప్రాంతాలు ఉన్నాయి. అక్కడ హనుమాన్ చాలీసాను రోజుకు రెండుసార్లు లౌడ్ స్పీకర్లలో, దేవాలయాల నుండి లేదా ఇళ్ల పైకప్పుల నుండి వినిపించనున్నారు. “రాబోయే రోజుల్లో.. ఇలాంటివి మరిన్ని ప్రాంతాలలో చూడబోతున్నాం. హిందువులు మైనారిటీలుగా ఉన్న ఆయా ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నాం. భజరంగ్ దళ్ ఆమ్ప్లిఫయర్లు, టైమర్‌లతో పాటు స్పీకర్లను విరాళంగా ఇవ్వాలని నిర్ణయించుకుంది, తద్వారా హనుమాన్ చాలీసా రోజుకు రెండుసార్లు వినిపించబడుతుందని భజరంగ దళ్ కార్యకర్తలు తెలిపారు.

అక్కడి కొన్ని ప్రాంతాల్లో హిందువులు మైనార్టీలుగా మారారు. ఆజాద్ నగర్‌లోని కొన్ని ప్రాంతాలలో హిందువులు మైనారిటీలుగా మారారు. గత కొన్నేళ్లుగా జనాభాలో మార్పు వచ్చింది. ఆయా ప్రాంతాల్లో అట్టడుగు కులాల ప్రజలు నివసించేవారు. కొందరు వచ్చి దళితులు హిందువులు కాదని విభజించడం మొదలు పెట్టారు. ఆ ప్రాంతాల్లో మెల్లమెల్లగా ముస్లింల ఆధిపత్యం మొదలైందని.. హిందువుల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నించారని భజరంగ్ దళ్ నాయకులు తెలిపారు. వాళ్లంతా హిందువులే అని భరోసా ఇచ్చే బాధ్యతను మేం తీసుకున్నామని.. అందుకే ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు. సూరత్‌లోని వేసు ప్రాంతంలో కొంతమంది ముస్లిం యువకులు వచ్చి న్యూసెన్స్ సృష్టిస్తూ ఉంటారని భజరంగ్ దళ్‌కు చెందిన రాహుల్ శర్మ తెలిపారు. “మేము ఈ ప్రాంతంలో హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించాము. ఇప్పుడు ఇబ్బంది తక్కువగా ఉంది. భూత్ పిశాచ్ నికత్ నహీన్ ఆవే, మహాబీర్ జబ్ నామ్ సునావే” అని ఆయన చెప్పుకొచ్చారు. ఇంతకు ముందు ప్రజలు స్పీకర్ల వాడకాన్ని వ్యతిరేకించేవారు.. కానీ ఇప్పుడు లౌడ్ స్పీకర్లలో హనుమాన్ చాలీసా పారాయణాన్ని వారు వింటున్నారని తెలిపారు.

సూరత్‌లో హనుమాన్ చాలీసా
ఈ సంవత్సరం ప్రారంభం నుండి, సూరత్‌లోని ప్రజలు రోజుకు రెండుసార్లు హనుమాన్ చాలీసా పఠించడం ప్రారంభించారు. హనుమాన్ చాలీసా వల్ల హిందూ ధర్మం గురించి అవగాహన ఏర్పడుతుందని సూరత్ వాసులు చెప్పారు. ఇది కేవలం సూరత్‌కే పరిమితం కాలేదని, గుజరాత్‌లోని ఇతర ప్రాంతాల్లో కూడా హనుమాన్ చాలీసా పారాయణాన్ని నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. శ్రీ సాయినాథ్ యువక్ మండల్ వంటి స్థానిక హిందుత్వ గ్రూపులు, దుర్గా వాహిని, మాతృ శక్తి మహిళా బృందం కూడా పలు హిందూ ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నాయి.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five × 2 =

Back to top button