More

    నారాయణకు బెయిల్ మంజూరు.. లేఖలు రాసిన చంద్రబాబు

    పదో తరగతి ప్రశ్న పత్రాల లీక్ కేసులో అరెస్ట్ అయిన నారాయణ విద్యాసంస్థల అధినేత, ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిలు మంజూరైంది. హైదరాబాద్‌లో అరెస్ట్ చేసిన చిత్తూరు జిల్లా పోలీసులు అనంతరం చిత్తూరుకు తరలించారు. వైద్య పరీక్షల అనంతరం మేజిస్ట్రేట్ ఎదుట నారాయణను హాజరుపరిచారు. ఆయనపై పోలీసులు మోపిన అభియోగాలను తోసిపుచ్చిన న్యాయమూర్తి సులోచనారాణి వ్యక్తిగత పూచీకత్తుపై నారాయణకు బెయిలు మంజూరు చేశారు. నారాయణ విద్యాసంస్థల చైర్మన్ పదవికి నారాయణ 2014లోనే రాజీనామా చేసినట్టు ఆయన తరపు న్యాయవాదులు కోర్టుకు ఆధారాలు చూపించారు. ఆ వాదనలతో అంగీకరించిన కోర్టు బెయిలు మంజూరు చేసింది. లక్ష రూపాయల చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. బెయిలు లభించిన అనంతరం నారాయణ మాట్లాడుతూ.. నారాయణ విద్యాసంస్థల అధినేతగా తాను 2014లోనే తప్పుకున్నా, పోలీసులు తనపై తప్పుడు అభియోగం మోపారని అన్నారు. సంస్థతో తనకు ఎలాంటి సంబంధమూ లేదని కోర్టుకు ఆధారాలు సమర్పించామని, దీంతో తనపై మోపిన నేరారోపణ నమ్మేలా లేదన్న అభిప్రాయానికి వచ్చిన న్యాయమూర్తి బెయిలు మంజూరు చేసినట్టు చెప్పారు. ఘటన జరిగిన నాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 18లోగా రూ. లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది అన్నారు.

    నారాయణను అరెస్టు చేయ‌డంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. ఈ అరెస్ట్ రాజకీయ కక్షతో జరిగిందని ఆరోపించారు. అరెస్ట్ చేసిన నారాయ‌ణ‌ను చిత్తూరుకు తరలించడంలో జాప్యం వెనక కూడా దురుద్దేశం ఉందని చంద్రబాబు తెలిపారు. రఘురామ కృష్ణంరాజు అరెస్ట్ సమయం జరిగిన ఉదంతాన్ని లేఖలో ప్రస్తావించారు చంద్రబాబు. చిత్తూరు SP వైసీపీ కి అనుకూలం గా వ్యవహరించే అధికారి అని లేఖలో పేర్కొన్నారు. ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో అదనపు సెక్షన్లు జోడించి అరెస్ట్ చేశారని చంద్రబాబు అన్నారు. ఈ ఘటనపై జోక్యం చేసుకుని న్యాయం చేయాలని అన్నారు.

    Trending Stories

    Related Stories