బాహుబలి సత్యరాజ్ పరిస్థితి విషమమంటూ వార్తలు

0
858

ప్రముఖ సినీనటుడు బాహుబలి ఫేమ్ సత్యరాజ్ కు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. వైద్య పరీక్షల అనంతరం ఆయన ఆసుపత్రిలో చేరారు. చెన్నైలోని అమింజిక్కరైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నారు. కోవిడ్ పరీక్షలు చేయగా పాజిటివ్ వచ్చింది. దీంతో ఆయన హోమ్ ఐసొలేషన్ లో ఉంటున్నారు. గత రాత్రి ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి సీరియస్ గానే ఉన్నట్టు తమిళ మీడియా చెప్పింది.

నటి త్రిష కూడా కరోనా బారినపడింది. ఈ విషయాన్ని త్రిష సోషల్ మీడియా అన్ని రకాల జాగ్రతలను, కరోనా నిబంధనలను పాటించినప్పటికీ కరోనా బారిన పడ్డానని త్రిష తెలిపారు. న్యూఇయర్ కు ముందు తనకు కరోనా సోకిందని చెప్పారు. కరోనాకు సంబంధించిన అన్ని లక్షణాలు తనకు ఉన్నాయని తెలిపారు. చాలా భయంకరమైన సమయాన్ని అనుభవించానని చెప్పారు. ప్రస్తుతం కోలుకుంటున్నానని, ఆరోగ్యం కొంత మెరుగ్గా ఉందని తెలిపారు. తనను కాపాడిన వ్యాక్సిన్లకు ధన్యవాదాలు చెపుతున్నానని అన్నారు. ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్లు వేయించుకోవాలని, మాస్కులు ధరించాలని అన్నారు.

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు కరోనా బారినపడ్డారు. తనకు కొవిడ్ పాజిటివ్ వచ్చిందని మహేశ్ బాబు స్వయంగా వెల్లడించారు. ఎన్ని ముందుజాగ్రత్తలు తీసుకున్నా కరోనా సోకిందని, స్వల్ప లక్షణాలతో బాధపడుతున్నానని తెలిపారు. ప్రస్తుతం వైద్య మార్గదర్శకాలు పాటిస్తూ ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉన్నానని వివరించారు. గత కొన్నిరోజులుగా తనను కలిసినవారందరూ తప్పనిసరిగా కరోనా టెస్టులు చేయించుకోవాలని మహేశ్ బాబు విజ్ఞప్తి చేశారు. ఎవరైనా ఇప్పటికీ వ్యాక్సిన్ తీసుకోకుండా ఉన్నట్టయితే వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని స్పష్టం చేశారు. వ్యాక్సిన్ తీసుకున్నట్టయితే కరోనా సోకినా గానీ తీవ్ర లక్షణాలు ఉండవని, ఆసుపత్రి పాలయ్యే అవసరాన్ని తగ్గిస్తుందని వెల్లడించారు.

మంచు లక్ష్మి కూడా కరోనా బారినపడ్డారు. తనకు కరోనా నిర్ధారణ అయిందని, తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని ఆమె తెలిపారు. రెండేళ్లుగా దోబూచులాడుతున్న కరోనా బూచోడు ఎట్టకేలకు తనను పట్టుకున్నాడని మంచు లక్ష్మి వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని, ఇంటి వద్దనే ఉంటూ సురక్షితంగా ఉండాలని ఆమె కోరారు.

సంగీత దర్శకుడు ఎస్ఎస్ తమన్ కూడా కరోనా బారినపడ్డారు. కరోనా నిర్ధారణ పరీక్షల్లో తమన్ కు పాజిటివ్ గా వెల్లడైంది. దాంతో వైద్యుల సలహా మేరకు ఇంటి వద్దే ఐసోలేషన్ లో ఉన్నారు. గత కొన్నిరోజులుగా తనను కలిసిన వారందరూ తప్పనిసరిగా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తమన్ సూచించారు.