Telugu States

బద్వేలులో ఆధిక్యంతో దూసుకుపోతున్న వైసీపీ

వైఎస్సార్‌ జిల్లా బద్వేలు ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ముందుగా పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో వైఎస్సార్‌సీపీ ఆధిక్యం సాధించింది. మొత్తం 259 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు ఉన్నాయి. రిటర్నింగ్ అధికారి, అభ్యర్థుల సమక్షంలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. బద్వేలులో నాలుగు హాళ్లలో లెక్కింపు ప్రారంభమైంది. ఒక్కో దాంట్లో పది రౌండ్లలో లెక్కింపు జరగనుంది. కొన్నింటిలో గరిష్ఠంగా 12 రౌండ్లలో లెక్కింపు జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు లెక్కింపు పూర్తయ్యే అవకాశం ఉంది.

బద్వేల్‌లో వైఎస్సార్‌సీపీ హవా కొనసాగుతోంది. మూడో రౌండ్‌ ముగిసే సరికి 23,754 ఓట్ల ఆధిక్యంలో వైఎస్సార్‌సీపీ కొనసాగుతోంది. తొలి రౌండ్‌లో 9వేల ఓట్ల ఆధిక్యం వైఎస్సార్‌సీపీ సొంతం చేసుకుంది. తొలి రౌండ్‌లో వైఎస్సార్‌సీపీ 10,478, బీజేపీ 1688, కాంగ్రెస్‌కు 580 ఓట్లు లభించాయి.

గురుకుల ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఇందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేశారు. నాలుగు కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఎన్నికల కమిషన్‌ జారీచేసిన కోవిడ్‌ మార్గదర్శకాలను అనుసరించి ఒక్కో కౌంటింగ్‌ కేంద్రంలో ఏడు టేబుళ్లను ఏర్పాటుచేశారు. ప్రతి కేంద్రంలో ఆర్వో, ఏఆర్వోలకు ఒక టేబుల్‌ ఏర్పాటుచేశారు. ప్రతి కౌంటింగ్‌ కేంద్రంలో ఒక సూపర్‌వైజర్, అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్‌ ఉంటారు. నియోజకవర్గంలో మొత్తం 2,15,240 ఓట్లు ఉండగా, 1,47,213 ఓట్లు పోలయ్యాయి. మొత్తం 68.39 శాతం పోలింగ్‌ నమోదైంది.

Related Articles

Back to top button